ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న… వాళ్లే నన్ను కాపాడారు: పవన్ కళ్యాణ్

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తూ రాజకీయాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇలా రాజకీయాలలో సినిమాలలో ఎంతో బిజీగా గడుపుతున్న ఈయనకు రెండు తెలుగు రాష్ట్రాలలో విపరీతమైన అభిమానులు ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు అయితే గతంలో ఈయన గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అయితే ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిన్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ పెద్దగా ఎవరితోనో కలిసేవారు కాదని అయితే తనతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులతో కూడా తన అభిప్రాయాలు కలవకపోవడంతో ఒంటరిగానే గడిపే వాడినని తెలిపారు. ఇలా తాను ఎనిమిదవ తరగతి చదువుతున్న సమయంలోనే పరీక్షలలో ఫెయిల్ అయ్యానని కష్టపడుతూ ఇంటర్ వరకు వెళ్లగా ఇంటర్లో కూడా ఫెయిల్ అవడంతో తనకు జీవితం పైనే విరక్తి వచ్చిందని తెలిపారు. తనతోపాటు చదువుకున్నటువంటి వారందరూ జీవితంలో ముందుకు వెళుతుండగా తాను మాత్రం జీవితంపై ఎంతో నిరుత్సాహపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకోవాలని భావించానని తెలిపారు.

ఈ విధంగా ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో తన కుటుంబ సభ్యులు చూడటం వల్లే బ్రతికి బయటపడ్డానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక అలా డిప్రెషన్ లో ఉన్నటువంటి తనకు తన అన్నయ్య చిరంజీవి వదిన సురేఖ ఎంతో ప్రోత్సాహం కల్పించి నన్ను స్థానంలో నిలబెట్టారని పవన్ వెల్లడించారు.ఇలా ఒకప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఈ హీరో ప్రస్తుతం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని చెప్పాలి.ఇక నేడు ఆయన పుట్టినరోజు కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.