కార్తి హీరోగా నటించిన 25వ చిత్రం ‘జపాన్’. రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్‌ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా కార్తి మీడియాతో మాట్లాడారు.
‘జపాన్’ ట్రూ స్టొరీ కాదు. కానీ వాస్తవ సంఘటనల స్ఫూర్తి కనిపిస్తుంది. దర్శకుడు రిపోర్ట్ నుంచి డైరెక్టర్ అయ్యారు. ఆయన చూసిన అనుభవాలు ఈ చిత్రంలో ఉన్నాయి. ఆయన దర్శకత్వం వహించిన ‘జోకర్’ సినిమాకి నేషనల్ అవార్డ్ వచ్చింది. కొత్త అనుభూతిని కలిగించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నప్పుడే ఇదే అవుట్ అఫ్ ది బాక్స్ మూవీ అనిపించింది. మాస్, ఫన్ అన్నీ ఎలిమెంట్స్ వున్న యూనివర్సల్ ఎంటర్టైనర్‌ఇది.
ఇందులో ప్రతి సన్నివేశం చాలా కొత్తగా ఒరిజినల్‌గా వుంటుంది. సినిమా చూస్తే ఈ టైటిల్ ఎందుకు పెట్టామో తెలుస్తుంది. ఈ చిత్రలో మంచి సెటైర్ వుంది. డార్క్ కామెడీ బాగా పండిరది. ఊపిరి సినిమాకి తమిళ వెర్షన్ డైలాగులు రాసింది ఆయనే. అప్పుడే ఆయన హ్యుమర్ చూసి షాక్ అయ్యాను. ఇందులో ఆ హ్యుమర్ ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తుంది.
చాలా రోజుల తర్వాత మాస్‌తోపాటు హ్యుమర్ సెటైర్ వున్న డిఫరెంట్ రోల్ చేశా. నేటి సమాజాన్ని రిఫ్లెక్ట్ చేసే కథ ఇది. యూనివర్సల్ ఆడియన్స్‌కి ప్రజెంట్ చేయడానికే చాలా ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులతో పని చేశాం. ఎస్ రవివర్మన్ అద్భుతమైన విజువల్ ట్రీట్మెంట్ ఇచ్చారు. అలాగే జీవీ ప్రకాష్ మ్యూజిక్‌తో మరో స్థాయికి తీసుకెళ్లారు. జపాన్ చాలా బలమైన కథ. దీనికి సీక్వెల్, ప్రీక్వెల్ ఎదో ఒకటివుండాలని క్లైమాక్స్‌కి ముందే దర్శకుడితో చెప్పాను.
జపాన్ పాత్రను మళ్లీ చేయాలని ఉంది. ‘సూదుకవ్వం’ చిత్ర దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే 96 దర్శకుడు ప్రేమ్ కుమార్ తో ఓ సినిమా చేస్తున్నాను. ఈ రెండు దేనికవే ప్రత్యేకం. అలాగే ఖైదీ 2, సర్దార్ 2 కూడా వున్నాయి. ప్రస్తుతం ఖైదీ 2 చిత్రం కోసం ఎదురుచూస్తున్నా. చర్చలు జరుగుతున్నాయి. రోలెక్స్ గురించి ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి. దీని గురించి అన్నయ్య (సూర్య), దర్శకుడు లోకేష్ కనకరాజ్‌ని అడగాలి( నవ్వుతూ).