మెడపై చేతులేసి పట్టేసుకుంది.. అషూ రెడ్డి రాహుల్ రచ్చ

మెడపై చేతులేసి పట్టేసుకుంది.. అషూ రెడ్డి రాహుల్ రచ్చ

రాహుల్ సిప్లిగంజ్ అషూ రెడ్డిల వ్యవహారం ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. బిగ్ బాస్ మూడో సీజన్‌ నడిచినప్పుడు ఆ ఇంట్లో ఈ ఇద్దరూ క్లోజ్ కాదు. కానీ బయటకు వచ్చాక మాత్రం జాన్ జిగ్రీ దోస్తుల్లా చెట్టా పెట్టాలేసుకుని తిరుగుతున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలో రాహుల్ పునర్నవి కథ బాగా నడిచింది. కానీ బయటకు వచ్చాక మాత్రం రాహుల్ ట్రాక్ మారిపోయింది.

Ashu Reddy Guest To Rahul Sipligunj Ooko Kaka
Ashu Reddy Guest To Rahul Sipligunj Ooko Kaka

రాను రాను పునర్నవి సైడ్ అయిపోయింది. లైన్‌లోకి అషూ వచ్చింది. ఈ ఇద్దరి పోస్ట్‌లు, వీకెండ్ పార్టీలు, షేర్ చేసే ఫోటోలు, అందులో ఈ ఇద్దరి సాన్నిహిత్యం చూసి అందరూ రకరకాలుగా కామెంట్లు చేసేవారు.ఏకంగా అషూతో పెళ్లి ఎప్పుడు? ప్రేమిస్తారుకదా? అంటూ ప్రశ్నలు ఎదురయ్యేవి. కానీ తామిద్దరం కేవలం బెస్ట్ ఫ్రెండ్స్, జాన్ జిగ్రీ దోస్తులం అంటూ చెప్పుకొస్తున్నారు.కానీ నెటిజన్లు మాత్రం ఈ ఇద్దరిని ప్రత్యేకంగా చూస్తున్నారు.

తాజాగా రాహుల్ ఓ పోస్ట్ చేశాడు.అందులో రాహుల్ వెనకాల అషూ దాగి ఉంది. అషూ కళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. వెనకలా ఎవరు ఉన్నారో తెలుసా? రేపటి మన గెస్ట్ అంటూ చెప్పుకొచ్చాడు. రేపు రాహుల్ తన ఊకో కాకా బ్రాంచ్‌ను హైద్రాబాద్‌లో ప్రారంభిస్తోన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడే అషూను పిలిపించినట్టున్నాడు. రేపటి ఈవెంట్‌లొ ఈ జోడిదే హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. తాజాగా రాహుల్ షేర్ చేసిన ఫోటోల్లోనే చేతులు వేసుకుని రచ్చ రచ్చ చేశారు.