అమ్మో అషూ పాప మామూల్ది కాదు.. ఆ సమయంలో అలా చేస్తుందట!!

Ashu Reddy Became Mad When Hungry

బిగ్‌బాస్ బ్యూటీ అషూ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వకముందు ఆమె ఒక స్టార్. ఏకంగా జూనియర్ సమంత అంటూ నెత్తిన పెట్టేసుకున్నారు. డబ్ స్మాష్ కాలం నడిచిన సమయంలో అషూ రెడ్డి ఓ రేంజ్‌లో ఫేమస్ అయింది. అలా వచ్చిన క్రేజ్ బిగ్ బాస్ ఆఫర్‌ను తీసుకొచ్చింది. అయితే అప్పటి వరకు తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలియదు. జూనియర్ సమంత అంటే విన్నారు కానీ చూడలేదు. ఒక్కసారిగా బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చాక అందరూ షాక్ అయ్యారు.

Ashu Reddy Became Mad When Hungry
Ashu Reddy Became Mad When Hungry

కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అషూ రెడ్డి బాగా లావైంది. లవ్ ఫెయిల్యూర్, డిప్రెషన్‌లోకి వెళ్లడంతో అలా అయిపోయానని చెప్పింది. బిగ్ బాస్ షోలో మొదటి రెండు మూడు వారాలు ఆమె అంతగా ఫోకస్ కాకపోయినా తరువాత బాగానే క్రేజ్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమె ఒక సెలెబ్రిటీ అయింది. మళ్లీ పాత రూపాన్ని తెచ్చుకుంది. కష్టపడింది.. జీరో సైజ్ లోకి వచ్చింది. మళ్లీ జూనియర్ సమంతలా మారింది.

Ashu Reddy Became Mad When Hungry
Ashu Reddy Became Mad When Hungry

తాజాగా ఈ మధ్య అషూ జబర్దస్త్ స్టేజ్ మీదా కనబడింది. తాగుబోతు రమేష్ టీంలో అదిరిపోయేలా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. అషూ గ్లామర్‌కు అందరూ ఫిదా అయ్యారు. అషూ వల్ల ప్రోమో కూడా ఓ రేంజ్‌లో వైరల్ అయింది. అయితే తాజాగా అషూ ఓ పోస్ట్ చేసింది. మామూలుగా ఈ మధ్య అట్ట ముక్కల బ్యాచ్ ఒకటి తయారైంది. ఏదైనా ఉంటే అట్ట ముక్కల మీద రాసి.. రోడ్డు మీద నిలబడతారు కదా. అలాంటి ఓ పోస్ట్‌నే అషూ తాజాగా షేర్ చేసింది. ఆకలి వేసిన సమయంలో కొంచెం పిచ్చెక్కిపోతుంది.. సారీ అంటూ ఒకామే అట్ట ముక్క పట్టుకుంది. తనకు కూడా అంతే అంటూ ఆకలిగా ఉన్నప్పుడు కోపం వస్తుంది.. అప్పుడు ఇలాగే సారీ చెప్తాను అంటూ పేర్కొంది.