అసలు పేరు అదే.. గుట్టు విప్పిన అషూ రెడ్డి

Ashu Reddy about Her Original name

బిగ్ బాస్ షో ద్వారా అషూ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయింది. అంతకు ముందు డబ్ స్మాష్ అనే యాప్ ద్వారా వీడియోలు చేసి క్రేజ్ తెచ్చుకుంది. అలా అషూ రెడ్డి అనే పేరు తెరపైకి వచ్చింది. అక్కడినుంచి అషూ రెడ్డి బిగ్ బాస్ వరకు వెళ్లింది. బిగ్ బాస్ ఇంట్లో మొదట్లో కొంచెం సైలెంట్‌గా ఉంది. ఆ తరువాత వారాలు గడుస్తున్న కొద్దీ అషూ రెడ్డి బయటకు వచ్చింది. డ్యాన్సులు, కౌంట్లు, సెటైర్లు వేస్తూ అషూ రెడ్డి బాగానే ఫేమస్ అయింది. టాస్కులు కూడా బాగానే ఆడింది.

Ashu Reddy about Her Original name
Ashu Reddy about Her Original name

అలా మొత్తానికి బిగ్ బాస్ వల్ల జనాలు గుర్తించడం ప్రారంభించారు. ఇక రాహుల్ సిప్లిగంజ్‌తో ఫ్రెండ్ షిప్ మొదలైన క్షణం నుంచి ఇద్దరూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు. అలా ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందని రూమర్లు రావడం, ఆ ఇద్దరూ కూడా వాటికి తగ్గట్టే ఫోటోలు పెట్టడం నెటిజన్లకు రిప్లైలు ఇవ్వడం వంటివి చేస్తుంటారు. అలా ఈ ఇద్దరి వ్యవహారం ఎప్పుడూ కూడా వైరల్ అవుతూనేఉంటుంది.

అయితే తాజాగా అషూ రెడ్డి తన అసలు పేరు బయటకు చెప్పింది. తన అసలు పేరు అశ్వినీ రెడ్డి అని ముద్దు పేరు అషూ అని చెప్పుకొచ్చింది. తన పూర్తి పేరు కొందరికీ మాత్రమే తెలుసంది. అలా అందరూ అషూ అషూ అని పిలవడంతో ఇప్పుడు అదే ఫిక్స్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. ఇక రాహుల్‌తో ఉన్న రిలేషన్ గురించి కూడా అషూ నోరు విప్పింది. ఫ్రెండ్ కంటే కాస్త ఎక్కువే అని చెప్పుకొచ్చింది.