ఈ మధ్య కాలంలో చాలా మంది లివింగ్ రిలేషన్, పెళ్లికి ముందే తల్లిదండ్రులు అవడం కామన్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఇలాంటి వార్తలు చాలానే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా సినీ నటులకు అయితే ఇవి చాలా కామన్. సెలబ్రిటీస్ కాబట్టి ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ఇలా వారి విషయాలు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. అందరికీ తెలిసిపోతుంటాయి.
బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్, మోడల్ గార్బెల్లాలు కూడా ఇదే కోవలోకి వస్తారు. అయితే వీరిద్దరూ చాలా కాలంగా కలిసే ఉంటున్నారు. ఏడడుగుల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కాకపోయినా ప్రేమ బంధంతోనే కలిసి జీవిస్తున్నారు. కలిసి జీవించడమే కాదండోయ్ పిల్లలను కూడా కంటున్నారు. ఇప్పటికే వీరిద్దరికీ ఓ బాబు పుట్టగా.. తాజాగా రెండోసారి గార్బెల్లా తల్లి కాబోతుంది.
ఇదే విషయాన్ని తెలుపుతూ ఆమె ట్వీట్ చేయగా… పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజెన్లు. వాళఅలు మాత్రమే కాదండోయ్.. స్టార్ హీరోయిన్లు కాజల్, అమీ జాక్సన్ లు కూడా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అర్జున్ రాంపాల్ 1998లో మెహర్ ను పెళ్లి చేసుకోగా.. వీరిద్దరి మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో 2019లో వీళ్లు విడాకులు తీసుకున్నారు.
ఆతర్వాత అర్జున్ రాంపాల్ గార్బెల్లాతో ప్రేమలో పడ్డారు. అలాగే తాము సహజీనం చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత వీరిద్దరికీ ఓ బాబు జన్మించాడు. ఇప్పుడు ఆమె రెండో సారి గర్భం దాల్చింది. ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులు కాబోతున్నప్పటికీ వీరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. చేసుకునే ఉద్దేశం కూడా లేనట్లుగానే కనిపిస్తోంది.
అర్జున్ రాంపాల్ కేవలం నటుడిగానే కాకుండా మోడల్, నిర్మాత, టీవీ వ్యాఖ్యాతగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో హిందీ సినిమా ప్యార్ ఇష్క్ ఔర్ మెహబ్బత్ సినిమా ద్వారా సినీ రంగంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తెలుగుతో పాటు ఇంగ్లీష్ చిత్రాల్లో కూడా నటించారు. తాజాగా ఈయన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా చేస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో కూడా కనిపించనున్నారు.