లేటెస్ట్ : “ఓజి” పై అర్జున్ దాస్ క్రేజీ అప్డేట్ 

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రాల్లో దర్శకుడు సుజీత్ తో చేస్తున్న భారీ ఏక్షన్ డ్రామా “ఓజి” ఫై ఉన్న హైప్ గాని దాని విషయంలో పెరుగుతున్న బజ్ కానీ ఇప్పుడు అంతా ఇంతా కాదు. మరి ఇప్పుడు ఈ చిత్రం షూటింగ్ ఇంకా ఇప్పుడు ప్రోగ్రెస్ లోనే ఉండగా..

ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే భారీ అప్డేట్ ని ఈ సెప్టెంబర్ 2న లాక్ చేశారు. దీనితో ఈ రోజు కోసం ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుండగా మరి ఈ అప్డేట్ పై లేటెస్ట్ గా కోలీవుడ్ యంగ్ నటుడు తన వాయిస్ తోనే మంచి ఫేమ్ తెచ్చుకున్న యంగ్ స్టర్ అర్జున్ దాస్ కూడా హైప్ ఎక్కిస్తున్నాడు.

ఆడియెన్స్ ని ఈ సెప్టెంబర్ 2 కి సిద్ధంగా ఉండండి అంటూ ఓజి టాగ్స్ అండ్ ఫైర్ ఎమోజిస్ కి లేటెస్ట్ గా పోస్ట్ పెట్టడం ఫాన్స్ లో మరింత హైప్ ఎక్కించింది. ఇప్పటికే ఈ సినిమాని కేజీఎఫ్ అంతకు మించిన లెవెల్లో పవన్ వెర్షన్ నుంచి ఊహించుకుంటున్నారు. ఒకవేళ జస్ట్ పాజిటివ్ టాక్ వస్తే ఇక బాక్సాఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అనే లెవెల్లో ఇప్పుడు అంచనాలు ఈ సినిమా చుట్టూతా వాతావరణం నెలకొంది.

ఇప్పుడు అర్జున్ దాస్ కూడా సెప్టెంబర్ 2 కోసం రెడీ అవ్వమంటున్నాడు మరి అసలు ఆరోజు మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో వేచి చూడాలి. ఇక ఈ చిత్రంలో యంగ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నటిస్తుండగా శ్రీయ రెడ్డి శ్యామ్ తదితర నటులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.