Ariyana: అరియనా గ్లోరీ.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. యూట్యూబ్ యాంకర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ. ఆపై ఎన్నో టీవీ షోలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాతో వేరే స్థాయి ర్యాపో పెంచుకుంది ఈ భామ.
ఇక తన అందంతో ఎంతో మంది సోషల్ మీడియా ప్రియులను ఫిదా చేసింది. ఇక ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి అందులో తన అద్భుతమైన ఆటను కనపరిచి ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక బిగ్బాస్ దయతో వరుస ఆఫర్లతో ఓ వెలుగు వెలుగుతుంది.
ఇక ఇప్పుడు ఓటీటీ లో ఇరవై నాలుగు గంటలకు ప్రసారమయ్యే బిగ్ బాస్ మొదటి సీజన్లో కంటెస్టెంట్ గా ఎంటర్ అయింది ఈ ముద్దుగుమ్మ. ఇక వచ్చి రావడమే తన బాయ్ ఫ్రెండ్ విషయంలో అడ్డంగా బుక్ అయింది. ఇక అరియనా గ్లోరీ తో హోస్ట్ అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ఏంటమ్మా అరియనా.. నీకు సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ వున్నాడట కదా.ఇంతకీ ఎవరా వ్యక్తి అని ముక్కుసూటిగా అడిగేసాడు. ఇక దాంతో హర్యానా సిగ్గు పడి పోయింది. అయ్యో సార్.. సీక్రెట్ బాయ్ ఫ్రెండ్ గురించి మీకు ఎలా తెలిసింది ఉన్నారు లెండి కొందరు. అయినా దాని గురించి నేను మాట్లాడింది సార్ అది చాలా సీక్రెట్ అంటూ నోరు జారి బాయ్ ఫ్రెండ్ విషయం బయట పెట్టింది.
ఇక అరియనా వ్యక్తిగత విషయానికి వెళితే హైదరాబాదులో ఆధునిక మంచి కుటుంబం లో పెరిగింది. ఆమె అదే పట్టణంలో ఒక ప్రైవేటు పాఠశాలలో తన ఆధునిక విద్యను పూర్తి చేసింది. అంతే కాకుండా తన కళాశాల విద్యను కూడా హైదరాబాదులోనే పూర్తిచేసింది. అరియనా హిందూ మతాన్ని అనుసరిస్తుంది. ఇక ఓటీటీ లో ప్రసారమయ్యే నాన్ స్టాప్ బిగ్ బాస్ లో ఏరియాన గ్లోరీ ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.