ముద్దు ముద్దు మాటలతో తండ్రికి కందిరీగల కథ చెబుతున్న అర్హ.. వైరల్ అవుతున్న వీడియో!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ గురించి అందరికీ సుపరిచితమే. అర్హ ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇంత చిన్న వయసులోనే ఎన్నో తెలివితేటలు కలిగినటువంటి అర్హకు సంబంధించిన అన్ని విషయాలను అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా తన పిల్లల విషయాలను షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలోనే ఈ పిల్లలకి కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.

ఇకపోతే అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు స్నేహారెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈమె పుట్టినరోజు సందర్భంగా అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా అల్లు అర్హతో కలిసి చేసినటువంటి ఒక వీడియోని షేర్ చేస్తూ నా ముద్దుల పాప అల్లు అర్హకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ అల్లు అర్జున్ తన కుమార్తెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ వీడియోలో భాగంగా అల్లు అర్హ తన ముద్దు ముద్దు మాటలతో తండ్రికి కందిరీగల కథ చెబుతూ ఉన్నటువంటి వీడియోని షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.

ఇకపోతే నేడు అల్లు అర్జున్ కుమార్తె అర్హ పుట్టినరోజు జరుపుకోవడంతో పెద్ద ఎత్తున అభిమానులు తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇకపోతే అల్లు అర్హ బాలనటిగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈమె గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శాకుంతలం సినిమాలో భరతుడి పాత్రలో నటించారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఈ విధంగా అర్హ తన మొదటి సినిమానే పాన్ ఇండియా సినిమాలో బాలనటిగా చేయడం విశేషం.