పూజా డిమాండ్ చేస్తుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు..వదిలే ప్రసక్తే లేదట ..!

టాలీవుడ్ లో వరస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్న పూజా హెగ్డే ఈ ఏడాది ప్రారంభంలోనే అల్లు అర్జున్ – త్రివిక్రం కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాతో తన క్రేజ్ మరింతగా పెరిగింది. క్రేజ్ కంటే కూడా రెమ్యూనరేషన్ బాగా డిమాండ్ చేస్తోందన్న టాక్ ఎక్కువగా వినిపిస్తోంది. అల వైకుంఠపురములో తర్వాత టాలీవుడ్ లో చేస్తున్న రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియన్ సినిమా రాధే శ్యామ్ సినిమాకి భారీగా రెమ్యూనరేషన్ అందుకుంటుందట.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

అలాగే అఖిల్ అక్కినేని హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాకి రెండు కోట్ల కి పైగానే రెమ్యూనరేషన్ పుచ్చుకుందన్న మాట వినిపిస్తోంది. ఇక బాలీవుడ్ లో చేస్తున్న సల్మాన్ ఖాన్, రణ్ వీర్ సింగ్ సినిమాలకి దాదాపు 3 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. కాగా ప్రభాస్ రాధే శ్యాం.. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలు దాదాపు పూర్తి చేసిందట పూజా. కాగా టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లో కూడా రూపొందబోతున్న ఒక భారీ బడ్జెట్ సినిమా కోసం దాదాపు 2.5 కోట్లు అడిగినట్టు వార్తలు వస్తున్నాయి.

అయినా మేకర్స్ పూజా ని ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కాస్త రెమ్యూనరేషన్ తగ్గించుకోమని రిక్వెస్ట్ చేశారట. మరి పూజా తన రెమ్యూనరేషన్ తగ్గించుకుందా లేదా అన్నది తెలియలేదు. ఇక ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ నిర్మించబోతుండగా హను రాఘవపూడి దర్శకత్వంలో స్వప్నాదత్ వార్ బ్యాక్ డ్రాప్ ఫిక్షనల్ పిరియాడిక్ లవ్ స్టోరీగా రూపొందించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో మరో హీరోయిన్ గా మరో స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అలాగే మహానటి సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్నటు తెలుస్తోంది.