సంవత్సరానికి సరిపడా ఆహా కంటెంట్.. వాళ్ళందరూ ఇక క్లోజ్ చేసుకోవాల్సిందేనా ..?

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మొదలు పెట్టిన డిజిటల్ యాప్ ఆహా ఊహించని రీతిలో ప్రేక్షకాధరణ పొందుతోంది. ఇంత త్వరగా జనాలలోకి దూసుకు వెళుతుందని ఏ ఒక్కరు అనుకోలేదు. పూర్తి స్థాయిలో తెలుగు కంటెంట్ మాత్రమే ఆహా లో ఉండటం ప్రత్యేకత ని సంతరించుకుంది. కాగా ఆహా లో ఇప్పటికే కొన్ని సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆహా మీద జనాలకి ప్రేక్షకులకి మంచి అభిప్రాయం ఏర్పడడానికి కావలసిన వినోదం అందించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.

Will Allu Aravind's 2nd Hand Strategy Work Out?

చెప్పాలంటే దాదాపు సక్సస్ అయినట్టే. కాగా దీపావళి పండుగ సందర్భంగా సంవత్సరానికి సరిపడా కంటెంట్ ఆహా లో ఉండబోతుందని తాజాగా జరిగిన ఈవెంట్ లో వెల్లడించారు. అంతేకాదు ఆయా ప్రాజెక్ట్స్ కి సంబంధించిన పోస్టర్స్ ని రిలీజ్ చేశారు. ఈ దీపావళి నుంచి వచ్చే దీపావళి వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లు, టాక్ షోస్ .. ఇలా చాలా కార్యక్రమాలని ప్లాన్ చేస్తున్నారు. అంతేకాదు దాదాపు అందరూ స్టార్ రైటర్స్.. డైరెక్టర్స్.. యాక్టర్స్ వీటికి పని చేస్తున్నారు. ఇప్పటికే సమంత సామ్ జామ్ అన్న టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ఈ టాక్ షో స్ట్రీమింగ్ ప్రారంభం అయింది. ముందుగా ఈ టాక్ షోకి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ గెస్ట్ గా వచ్చాడు. అలాగే మెగాస్టార్, అల్లు అర్జున్, సైనా నెహ్వాల్, తమన్నా, రవితేజ.. ఇలా దాదాపు ఇండస్ట్రీలో ఉన్న స్టార్స్ అందరూ ఈ టాక్ షోకి గెస్ట్ గా రాబోతున్నారు.

ఇక రీసెంట్ గా జరిగిన ఈవెంట్ లో ఆహా కోసం సుకుమార్ – హరీశ్ శంకర్ – సురేందర్ రెడ్డి – వంశీ పైడిపల్లి షోస్ చేయబోతున్నట్టు అల్లు అర్జున్ తెలిపాడు. అలాగే ‘’రుద్రవీణ’ ‘కంబాలపల్లి కథలు’ ‘కుబూల్ హై’ ‘కుడి ఎడమైతే’ ‘తోడేళ్ళు’ ‘ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్’ ‘సూపర్ ఓవర్’ ‘లెవన్త్ అవర్’ ‘మైదానం’ ‘బియాండ్ టెక్ట్స్ బుక్’ ‘మేజ్’ ‘అన్యాస్ ట్యుటోరియల్’ లాంటి సినిమాలను నిర్మించబోతున్నారు. మొత్తానికి అల్లు అరవింద్ ఆహా ని బాగానే సక్సస్ చేశారు. రానున్న రోజుల్లో టాలీవుడ్ భారీ సినిమాలు కూడా ఆహా లో రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇదే జరిగితే ఇక ఇప్పటి వరకు ఉన్న కొన్ని ప్రముఖ ఓటీటీలకి చెక్ పెట్టినట్టే.