టాలీవుడ్ సినిమాల అలాగే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఎప్పుడు నుంచో ముడిపడి ఉన్నాయి. సినిమాల్లో వారు రాజకీయాల్లోకి రావడం నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇపుడు మరింత స్థాయిలోకి వెళ్ళింది. మన తెలుగులో అయితే మొదట రాజకీయాల్లోకి వచ్చి భారీ సక్సెస్ అయ్యింది నందమూరి కుటుంబం.
అయితే వీరి కుటుంబంలోనే ఉన్న చాలా కలహాలు కోసం అందరికీ తెలిసిందే. మరి రీసెంట్ గా అయితే ఒకరి అభిప్రాయాలు ఒకరు చెప్పడం కూడా సెన్సేషన్ గా మారింది. ఏపీలో ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చడంపై టీడీపీ మరియు నందమూరి అభిమానుల్లో ఎలాంటి రచ్చ నెలకొందో తెలిసిందే.
దీనితో అప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ సీనియర్ ఎన్టీఆర్ ని మరియు వై ఎస్ ఆర్ ని కూడా సమానంగా మహా నాయకులు అంటూ చెప్పడం పలువురు నందమూరి అభిమానులకే నచ్చలేదు. దీనితో చాలామంది బాహాటంగానే ఎన్టీఆర్ పై పలు కామెంట్స్ చేశారు.
కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నందమూరి బాలకృష్ణ కూడా వై ఎస్ ఆర్ పై ఈ తరహా కామెంట్స్ చేయడం ఆసక్తిగా మారింది. దీనితో కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలాగే న్యూట్రల్ సపోర్ట్స్ బాలయ్య పై ఎవరైనా కామెంట్ చేసే దమ్ముందా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యపై అయితే టీడీపీ శ్రేణులు ఒకలా ఎన్టీఆర్ పై అయితే ఒకలా కామెంట్స్ చేయడం ఏంటి అని అభిమానులు సహా విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.