ఇంట్లో వద్దు వద్దు అంటుంటే.. అనుష్క శెట్టి లో డైలమా అంతకంతకు పెరుగుతోందట. త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకోనున్నారనేది తాజా ప్రచారం. ఇంతకీ ఏమిటా సంచలన నిర్ణయం?
స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ జర్నీ ఇప్పటికే దాదాపు 15 ఏళ్లు పూర్తయింది. సూపర్ (2005) సినిమాతో కెరీర్ ప్రారంభించిన అనుష్క ఆ తర్వాత అంచెలంచెలుగా టాలీవుడ్ లో ఎదిగింది. అరుంధతి సినిమాతో బాక్సాఫీస్ జేజమ్మగా సంచలనాలకు తెర తీసింది. ఆ తర్వాత బాహుబలి లాంటి పాన్ ఇండియా సినిమాలో డీగ్లామరస్ పాత్ర తో ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ట్రీట్ ఇచ్చింది.
ప్రస్తుతం వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తోంది. భాగమతి చిత్రంతో స్వీటీ సోలో బాక్సాఫీస్ స్టామినా 100 కోట్ల గ్రాస్ అని ప్రూవైంది. ప్రస్తుతం అనుష్క నటించిన `నిశ్శబ్ధం` రిలీజ్ కి రెడీ అవుతోంది. కోవిడ్ వల్ల థియేట్రికల్ రిలీజ్ సాధ్యపడక ఓటీటీ డీల్ ఫైనల్ చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఇది అనుష్క నటించిన నాయికా ప్రధాన చిత్రం. కోనవెంకట్ నిర్మించారు. అయితే ఈ సినిమా తర్వాత స్వీటీ మరో సినిమా చేస్తుందా? అంటే సందేహమేననేది సన్నిహితులు చెబుతున్నమాట.
ఎందుకంటే స్వీటీపై రకరకాల రూమర్లు ఇంట్లో పదే పదే చర్చకు వస్తున్నాయి. ఆ క్రమంలోనే తనకు పెళ్లి చేసి లైఫ్ ని సెటిల్ చేయాలని ఎదురు చూస్తున్నారట. నిరంతరం కుటుంబీకుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటూనే సినిమాల్లో నటించాల్సిన పరిస్థితి ఉండడంతో ఇకపై నటవృత్తికి గుడ్ బాయ్ చెప్పేయనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. స్వీటీ ఇంతకుముందు తన కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తిలో ప్రత్యక్షమైనప్పటి నుంచి తన పెళ్లి గురించిన టెన్షన్ పడుతున్నారని ప్రచారం సాగించారు. ఇప్పుడు పెళ్లి కోసమే కెరీర్ ని వదిలేయనుందన్న ప్రచారం సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. వేరొక కమిట్ మెంట్ కి అంగీకరించకపోవడానికి కారణం పెళ్లి ప్లాన్ అనే గుసగుస వేడెక్కిస్తోంది.