ఇండస్ట్రీ టాక్ : చిరు సినిమాకి హ్యాండిచ్చిన అనుష్క??

టాలీవుడ్ సినిమా దిగ్గజ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు చేస్తున్న చిత్రాల్లో అయ్యితే తన కెరీర్ లో 156 వ సినిమా పట్ల క్రేజీ అప్డేట్స్ ని మేకర్స్ ఈ మధ్య అందించారు. దీనిని అయితే “విశ్వంభర” గా తెరకెక్కిస్తుండగా మళ్ళీ చిరు నుంచి ఓ భారీ విజువల్ ట్రీట్ ని చూడబోతున్నటుగా కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఈ సినిమా మొత్తం మూడు లోకాల నడుమ నడిచే కథలా కనిపించనుండగా ఈ కథలో అయితే మొత్తం ముగ్గురు లేదా ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని రూమర్స్ వచ్చాయి. మరి ఈ రూమర్స్ లో భాగంగా మొదటి సారిగా చిరు పక్కన అయితే అనుష్క శెట్టి నటించబోతుంది అని ఆల్ మోస్ట్ సినిమా లాక్ అయినట్టే రూమర్స్ స్టార్ట్ అయ్యాయి.

కానీ ఇప్పుడు ఈ సినిమా విషయంలో అనుష్క నైస్ గా తప్పుకున్నట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే అనుష్క ప్రెజెంట్ తన కెరీర్ 50వ సినిమాపై కాన్సంట్రేట్ చేయడం స్టార్ట్ చేసిందట. దానిని మరింత స్పెషల్ చిత్రంగా చేయాలి అని అందుకే చిరు తో సినిమా వదులుకుంటున్నట్టుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మరి దీనితో పాటుగా అనుష్క తన 50 వ సినిమా హీరోయిన్ గా కంటే తనదంటూ ఓ ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాలో నటించాలని చూస్తుందట. అందుకే ఆ భారీ ఆఫర్ ని వదులుకున్నట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి స్వీటీ ఏం చేస్తుందో చూడాలి.