పాన్ ఇండియా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న అనుష్క లేటెస్ట్ సినిమా 

టాలీవుడ్ సినిమా దగ్గర ఉన్న ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ అందరిలో కూడా నెంబర్ 1 హీరోయిన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా అనుష్క శెట్టి అనే అంటారు. ఇండియా వైడ్ భారీ సక్సెస్ లు బాహుబలి లాంటి సినిమాలు చేసినప్పటికీ కూడా అనుష్క ఎలాంటి ఆర్భాటాలకు వెళ్లకుండా సింపుల్ సినిమాలు ఆమె ఎంచుకుంటూ వెళ్తుంది.

ఇక అలా చేసిన లేటెస్ట్ సినిమానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి కాగా దీనిని కొత్త దర్శకుడు మహేష్ బాబు తెరకెక్కించారు. అయితే ఈ చిత్రంలో హీరోగా జాతి రత్నాలు హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా చేసిన సినిమా ఇదే. మరి ఈ చిత్రం ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంది.

దీనితో ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లు లో ఆల్ మోస్ట్ రన్ ని కంప్లీట్ చేసుకోగా ఇపుడు మొత్తానికి ఓటిటి రిలీజ్ డేట్ ని ఈ చిత్రం తెచ్చుకుంది. కాగా ఈ సినిమా హక్కులని భారీ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ అక్టోబర్ 5 నుంచి స్ట్రీమింగ్ కి రానున్నట్టుగా అనౌన్స్ చేసారు.

కాగా ఈ చిత్రంని నెట్ ఫ్లిక్స్ వారు ఈ సినిమా తెలుగు, తమిళ్ హిందీ సహా కన్నడ మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కి రావడం ఫిక్స్ అయ్యింది. దీనితో ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా ఇక నుంచి ఓటిటి లో అలరించనుంది అని చెప్పాలి.