భారీ పోటీకి రాబోతున్న అనుష్క చిత్రం?

టాలీవుడ్ సినిమా దగ్గర భారీ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ చాలా తక్కువ మందే ఉంటే వారిలో సాలిడ్ మార్కెట్ కూడా హీరోయిన్స్ లో అనుష్క శెట్టి నెంబర్ 1 స్థానంలో ఇపుడు ఉంటుంది అని చెప్పడంలో డౌట్ లేదు. కాగా ఈ అనుష్క నుంచి ఓ సాలిడ్ సినిమా కోసం అంతా అవైటెడ్ గా వెయిట్ చేస్తుండగా..

ఇన్నాళ్ళకి ఆమె నుంచి రాబోతున్న చిత్రమే “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి”. ఈ చిత్రంలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి జాతి రత్నాలు ఫేమ్ ఉన్నప్పటికీ సినిమా మాత్రం అనుష్క బ్రాండ్ మీదే కొనసాగుతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఈ చిత్రం ఈ పాటికే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ సినిమా అయితే సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా బాలన్స్ ఉండడం మూలాన సినిమా విడుదల అయితే ఆగింది. కాగా కొత్త రిలీజ్ డేట్ కోసం అంతా చూస్తుండగా ఈ చిత్రం ఇప్పుడు భారీ పోటీకి రావచ్చని సినీ వర్గాలు చెప్తున్నాయి. మరి లేటెస్ట్ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సెప్టెంబర్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఇదే డేట్ లో పాన్ ఇండియా భారీ చిత్రం షారుక్ ఖాన్ నటించిన చిత్రం “జవాన్” సిద్ధంగా ఉండగా ఇదే డేట్ లో అనుష్క మూవీ కూడా వస్తే గట్టి పోటీ తప్పదని చెప్పాలి. కాగా మన తెలుగులో పర్వాలేదు కానీ తమిళ్ ఇతర భాషల్లో మాత్రం దెబ్బ పడొచ్చు. ఇక ఈ చిత్రానికి మహెష్ బాబు దర్శకత్వం వహించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.