అనుపమా.! ఏంటిది మరీనూ.!

‘డిజె టిల్లు’ సీక్వెల్, ‘టిల్లు స్క్వేర్’ వచ్చేస్తోంది. సెప్టెంబర్‌లో రిలీజ్ డేట్ కూడా ఖరారు చేసేసుకుంది. ఈ సినిమా కోసం చాలా మంది హీరోయిన్ల పేర్లు ప్రచారంలోకి వచ్చినా, చివరకు అనుపమ పరమేశ్వరన్ పేరు ఖరారయ్యింది.

‘డీజె టిల్లు’లో నేహా శెట్టి హీరోయిన్. సీక్వెల్‌లోనూ ఆమే కనిపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ, హీరోయిన్ మారింది. నేహా శెట్టి ఆ సినిమాలో చాలా బోల్డ్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. అంతకు మించి డబుల్ డోస్ బోల్డ్ అవతార్‌లో అనుపమ ‘టిల్లు స్క్వేర్’లో కనిపించబోతోందిట. లిప్ లాక్స్ కూడా వున్నాయని అంటున్నారు. ఈ లిప్ లాక్స్ దగ్గర్నే అనుపమ ఒకటికి పదిసార్లు ఆలోచించి, ఆలస్యం చేసిందట.

ఆమె కారణంగానే సినిమా షూటింగ్ కూడా ఆలస్యమైంది. కానీ, చివరికి ఆమె ఒప్పేసుకుంది. ముందే ఒప్పుకుని వుంటే, ఈపాటికి సినిమా థియేటర్లలోకి వచ్చేసి వుండేదేమో.!