సరోగసి కేసులో మరొక ట్విస్ట్… నయన్ దంపతులకు శిక్ష తప్పదా…?

సౌత్ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన నయనతార తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరిద్దరూ నాలుగు నెలల క్రితం వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం జరిగిన సమయం నుండి ఇద్దరు తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు. తాజాగా వీరిద్దరూ మరొక వివాదంలో నిలిచారు. నయన్ విగ్నేష్ దంపతులకు వివాహం జరిగిన నాలో నాలుగు నెలలకి వీరిద్దరూ సరోగసి పద్ధతి ద్వారా ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

సోషల్ మీడియా వేదికగా వీరే స్వయంగా ఆ విషయాన్ని వెల్లడించారు. దీంతో పెళ్లి జరిగిన నాలుగు నెలలకే సరోగసి ద్వారా పిల్లల్ని కనటం చట్ట రిత్యా నేరమని తమిళనాడు ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో తమకి ఆరు సంవత్సరాల క్రితమే వివాహం జరిగిందని ఏడాదికృతమే సరోగసి పద్ధతి ద్వారా పిల్లల్ని కనటానికి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లూ నయనతార దంపతులు వెల్లడించారు. అయితే ఆరు సంవత్సరాల క్రితం రిజిస్టర్ ఆఫీస్ లో చేసుకున్న పెళ్లికి సంబంధించిన ఆధారాలను అలాగే సరోగసి కోసం రిజిస్టర్ చేసుకున్న ఆధారాలను నయనతార దంపతులు ప్రభుత్వానికి అప్పజెప్పలేదు.

దీంతో తమిళనాడు ప్రభుత్వం ఈ విష‌యంపై మ‌రింత లోతుగా విచార‌ణ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యం తీసుకున్నట్లు సమాచారం. విచారణలో భాగంగా నయనతార ఇంటికి వెళ్లి విచారణ చేయాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణకు సంబంధించిన నోటీసులు కూడా నయనతారకు అందించారు. ఈ విచారణ ప్రారంభించడానికి ముందే నయనతార ఆధారాలను సేకరించి ప్రభుత్వానికి సమర్పించని పక్షంలో సరోగసికి సహకరించిన వారితో పాటు నయన్ దంపతులకు కూడా శిక్ష విధించే అవకాశం ఉంటుంది.