‘దేవర’ కోసం ఆ హీరోయిన్‌ని ఒప్పిస్తున్నారా.!

యంగ్ టైగర్ ఎన్టీయార్ హీరోగా ‘దేవర’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల. సినిమా ప్రారంభమవడానికి ముందు చాలా చాలా ఆలస్యం జరిగిన సంగతి తెలిసిందే.

‘ఆచార్య’ ఫెయిల్యూర్ తర్వాత కొరటాల దర్శకత్వంలో వస్తున్న సినిమా ఇది. అలాగే, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ సక్సెస్ అందుకున్న ఎన్టీయార్ నుంచి వస్తోన్న సినిమా కూడా. అందుకే, ‘దేవర’ వెరీ వెరీ స్పెషల్ మూవీ.

ఈ ‘దేవర’ కోసం బాలీవుడ్ నుంచి జాన్వీ కపూర్‌ని తీసుకొచ్చారు. మిగతా స్టార్ కాస్టింగ్ వేరే లెవల్‌లో ప్లాన్ చేశారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మాజీ హీరోయిన్‌ని తీసుకొస్తున్నారట.

ఆ హీరోయిన్ ఎవరో కాదు, గతంలో ఎన్టీయార్‌తో ఓ సినిమాలో నటించిందట. ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అప్పట్లో బాగా సెట్ అయ్యింది. కానీ, ఇప్పుడు చేయబోయే రోల్.. చాలా చాలా ప్రత్యేకమైనదట.. ఇంతకీ, సినిమాలకు దాదాపు దూరమైపోయిన ఆమె, ఆ పాత్రకి ఒప్పుకుంటుందా.?