బాలయ్య బిబి3 లో మరో నందమూరి హీరోని దింపిన బోయపాటి ..?

బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సినిమా అంటే నందమూరి ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బోయపాటి ఇంతక ముందు బాలయ్య కి ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి రెండు భారీ హిట్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు రెడీ అవుతున్న బిబి 3 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందుకు బిబి 3 ఫస్ట్ రోర్ ఒక ఉదాహరణ అని చెప్పాలి.

ప్రస్తుతం ఈ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – బాలయ్య కాంబోలో తెరకెక్కుతున్న బిబి 3 హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాలో కంచె బ్యూటి ప్రగ్యా జైస్వాల్ షూటింగ్ లో జాయిన్ అయింది. ఇప్పటికే పూర్ణ కూడా షూటింగ్ జాయిన్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో మరో నందమూరి హీరో నటించబోతున్నట్టు లేటెస్ట్ న్యూస్.

ఈ సినిమాలో ఒక కీలక పాత్ర ఉండగా ఆ పాత్ర కి హీరో నారా రోహిత్ అయితే బావుంటుందన్న అభిప్రాయంలో ఉన్న దర్శకుడు బోయపాటి నారా రోహిత్ ని ఎంచుకున్నాడని తెలుస్తోంది. కాగా ఈ క్యారెక్టర్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అని సమాచారం. ఇక ఈ సినిమాని ద్వారక క్రియోషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా సంగీత దర్శకుడు తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.

ఇక ఇప్పటి వరకు ఈ సినిమాకి పలు టైటిల్స్ అనుకున్నప్పటికి ఈ సినిమాలో బాలయ్య క్యారెక్టర్ పరంగా మోనార్క్ అన్న టైటిల్ పర్ఫెక్ట్ అని బోయపాటి బాగా నమ్మకంగా ఉన్నాడట. నందమూరి ఫ్యాన్స్ కూడా మోనార్క్ టైటిల్ బావుందన్న అభిప్రాయం లో కూడా ఉన్నారట. సో ఈ టైటిల్ నే దాదాపుగా ఫైనల్ చేయబోతున్నారని త్వరలో ఈ సినిమా టైటిల్ ని ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.