మహేష్‌ బాబు ‘గుంటూరు కారం’ నుంచి మరో లీక్ !?

మహేష్‌ బాబు, శ్రీలీల జంటగా నటిస్తున్న ‘గుంటూరు కారం’ సినిమా తుది దశకు చేరుకుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈనెల 25లోపు మొత్తం పూర్తవుతుందని యూనిట్‌ సభ్యుల టాక్‌. కేరళకి వెళ్లి తీయాల్సిన పాటని హైదరాబాదులో తీసేసారు అని తెలిసింది. కేరళలో వరదలు, లైటింగ్‌ కూడా అనుకున్నవిధంగా లేకపోవటంతో ఆ పాటని హైదరాబాదులో పూర్తి చేసినట్టుగా తెలుస్తోంది.

ఇది మాంటేజ్‌ పాట అని, ఇది ఇక్కడ హైదరాబాదులో పూర్తి చేసారని తెలిసింది. ఇక మిగతా పాటలని కూడా హైదరాబాదులోనే తీయనున్నట్టుగా కూడా తెలిసింది. ఒకటి శ్రీలీల, మహేష్‌ బాబు ల విూద ఉంటుందని, ఈ పాట కోసం ఒక ప్రత్యేక సెట్‌ కూడా తయారయిందని తెలిసింది. ఈ సినిమాలో మహేష్‌ బాబు పాత్ర పేరు రమణ అని కూడా ఒక చిన్న లీక్‌ బయటకి వచ్చింది.

అలాగే ఇంకో మాస్‌ పాట కూడా ఉండబోతోందని, ఇది కూడా హైదరాబాదులో తీస్తారని తెలిసింది. ఇక మహేష్‌ బాబు, ప్రకాష్‌ రాజ్‌ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో హైలైట్‌ గా వుంటాయని అంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలన్నీ చాలా ఇంటెన్సిటీ తో వుంటాయని తెలుస్తోంది. మహేష్‌ బాబు ఈ సినిమాకి డబ్బింగ్‌ కూడా మొదలుపెట్టేశారట.

అన్నీ ఈ నెల 25లోగా పూర్తి చేసెయ్యాలన్న దృఢ సంకల్పంతో మొత్తం యూనిట్‌ వున్నారని తెలుస్తోంది. జనవరి 5 నుండి ప్రచారాలు కూడా మొదలుపెడతారని తెలుస్తోంది. ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ నిర్మిస్తోంది.