ప్రస్తుతం టాలీవుడ్ సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అలాగే హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్నా క్రేజీ హ్యాట్రిక్ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి. మరి ఈ సినిమా రీజనల్ అయినప్పటికీ వీరి కాంబోపై ఉన్న అంచనాలతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది.
దీనితో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొనగా దీనితో పాటుగా సినిమాపై మాస్ లో కూడా మరింత హైప్ స్టార్ట్ అయ్యింది. రీసెంట్ గా వచ్చిన సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ అందుకోగా ఆ సాంగ్ ముందే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ సాంగ్ కి సంబంధించి షూట్ స్పాట్ నుంచి వీడియో కూడా లీక్ అవ్వడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఈ వీడియోలో అయితే మహీశా ఫుల్ మాస్ మోడ్ లో ఉన్నాడని చెప్పాలి. మహేష్ వేసిన మాస్ స్టెప్ లతో ఈ సాంగ్ మరింత లెవెల్లో కి వెళ్తుంది అని అనిపిస్తుంది. దీనితో ఈ క్లిప్ ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు హైదరాబాద్ లోనే జరుగుతూ ఉండగా సాంగ్ ని శేఖర్ మాస్టర్ కంపోజ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.
లీక్ ఏమో కానీ ఈ సాంగ్ క్లిప్ మాత్రం ఇపుడు బాగానే వైరల్ గా మారింది. అలాగే థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తుండగా మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 12న సినిమా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.