పవన్ కళ్యాణ్ నుంచి ఇంకోటి.! ఇది సీరియస్.!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి విడుదల కావాల్సిన సినిమాల లిస్టు పొడుగ్గానే కనిపిస్తోంది. ‘హరిహర వీరమల్లు’ సంగతి ఏమయ్యిందోగానీ, ‘బ్రో’ ఈ నెలాఖరున విడుదలవుతోంది. ‘ఓజీ’ కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఆల్రెడీ కొంత పార్ట్ షూటింగ్ జరిగింది.. అదీ కొద్ది రోజులు మాత్రమే.

‘హరిహర వీరమల్లు’ ఇప్పట్లో కష్టమే. కానీ, మిగతా మూడు సినిమాలు మాత్రం.. కాస్త గ్యాప్‌తో వరుసగా వచ్చేస్తాయ్. ‘బ్రో’ – ‘ఓజీ’ సినిమాలకు మధ్యన గ్యాప్ తక్కువే వుండొచ్చు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’కి కొంత గ్యాప్ వుంటుంది.

సందట్లో సడేమియా, పవన్ కళ్యాణ్ ఓ కొత్త సినిమాకి సైన్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది పూర్తిగా సీరియస్ మూవీ అట. డిఫరెంట్ జానర్‌లో వుంటుందని అంటున్నారు. ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ పవన్ కళ్యాణ్‌ని బాగా ఆకట్టుకుందట.

సీరియస్ మూవీ అంటే.. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ అనుకునేరు.! ఆ షేడ్స్ వున్న సినిమాగానేగానీ.. సామాజిక అంశాల నేపథ్యంలో వుంటుందట. జస్ట్ నెల రోజుల డేట్స్ పవన్ కళ్యాణ్ ఇస్తే, తక్కువ టైమ్‌లోనే సినిమా షూటింగ్ చేసెయ్యడానికి ఆ దర్శకుడు పూర్తి ప్లానింగ్‌తో వున్నాడట. నిర్మాణ సంస్థలకు కరువేం లేదు. చాలానే వున్నాయ్ పవన్ కళ్యాణ్ కోసం.