అదేంటీ.! ఆశ్చర్యపోతున్నారా.? మాజీ మామా కోడళ్లు.. ఈ కాంబో సెట్ అవ్వడమేంటీ అనుకుంటున్నారా.? ఆర్టిస్టులకు పర్సనల్ లైఫ్ వేరు, ప్రొఫిషనల్ లైఫ్ వేరు. అలాగే, అన్నీ సెట్ అయితే, ఏముంది.! మాజీ అయినా ప్రొఫిషనల్‌గా మళ్లీ కలవడంలో వింతేముంది.! అసలు మ్యాటర్ ఏంటంటే, సమంత, నాగార్జున కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్ కాబోతోందట.
కథ ఆల్రెడీ సిద్ధంగా వుందట. లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమా అని తెలుస్తోంది. నాగార్జున సైడ్ నుండి ఈ ప్రాజెక్ట్‌కి అంతా ఓకే అట. ఇక, సమంత వైపు నుంచే డిలే అవుతోందట. సమంత ఒప్పుకుంటే వెంటనే ప్రాజెక్ట్ పట్టాలెక్కేస్తుందట. అయితే, సమంత ఒప్పుకుంటుందా.? అనేదే చిన్న డైలమా.
గతంలో సమంత, నాగార్జున కలిసి చేసిన ‘మనం’, ‘రాజుగారి గది’ సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయ్. సో, అలా ఈ కాంబో ఎలాగైనా సెట్ చేయాలనుకుంటున్నారట మేకర్లు. ఒకవేళ సమంత నో చెబితే, ఆ ప్లేస్‌లో రకుల్ ప్రీత్‌ని తీసుకోవాలని అనుకుంటున్నారట. చూడాలి మరి.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయనీ సమాచారం.