లేటెస్ట్ : మరో హాలీవుడ్ ఆడిషన్ తో “NTR30”.!

మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు దర్శకుడు కొరటాల శివతో అయితే తన కెరీర్ లో 30వ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై భారీ అంచనాలు ఉండగా మొన్ననే గ్రాండ్ గా సినిమా కూడా లాంచ్ అయ్యింది.

కాగా ఇక అక్కడ నుంచి భారీ అప్డేట్స్ ఒకదాని మీద ఒకటి మేకర్స్ ఇస్తూ ఉండగా ఈ సినిమా ఇప్పుడు మరింత స్థాయిలో హాలీవుడ్ లెవెల్ లో ప్లానింగ్ ని జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో రీసెంట్ గానే ప్రముఖ హాలీవుడ్ ఏక్షన్ కొరియోగ్రఫర్ బెన్ని కేట్స్ ని దింపగా ఇపుడు మేకర్స్ మరో హాలీవుడ్ ఆడిషన్ ని అయితే దింపారు.

ఈసారి ఈ సినిమాకి గాను హాలీవుడ్ ప్రముఖ గ్రాఫిక్స్ డిజైనర్ బ్రాడ్ మినిచ్ ని రంగంలోకి దింపారు. మరి తాను అయితే జస్టిస్ లీగ్, బాట్ మాన్, ఆక్వా మెన్ లాంటి డీసీ కామిక్స్ చిత్రాలకి ఎక్కువగా వర్క్ చేశారు. మరి ఇలాంటి టెక్నీషియన్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.

కాగా ఈ సినిమాలో అయితే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువ సుధా ఆర్ట్స్ అనే కొత్త బ్యానర్ వారు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో అయితే పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. అలాగే ఈ సినిమా వచ్చే ఏడాది ఉగాది కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.