టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ వారసులు వెండితెరపైకి ఎంట్రీ ఇస్తున్నారంటే అంచనాలు మామూలుగా ఉండవు. ఇక చాలా కాలంగా అందరి ఫోకస్ మోక్షజ్ఞ పైనే ఉంది. బాలకృష్ణ లాంటి స్టార్ హీరో నుంచి రాబోయే వారసుడు అంటే బాక్సాఫీస్ వద్ద అంచనాలు అయితే మాములుగా ఉండవు. అయితే ఆయన తనయుడి ఆలస్యం వెనుక అనేక రకాల రూమర్స్ వస్తున్నాయి.
మొదటి నుంచి కూడా బాలయ్య నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ విషయంలో సరైన క్లారిటీ అయితే రాలేదు. మోక్షజ్ఞ వయసు ఇప్పటికే 25 ఏళ్ళు. అసలు అతనికి సినిమాల్లోకి రావడం ఇష్టం ఉందా లేదా అనే విషయంలో కూడా కొన్ని రూమర్స్ వస్తున్నాయి. కోన్ని వెబ్ మీడియాలలో అయితే అసలు మోక్షజ్ఞకు సినిమాల్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదని, ఇంతవరకు ఫిట్నెస్ కూడా మెయింటైన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపలేదు అంటేనే అర్థమవుతోందని రాసేస్తున్నారు.
బహుశా మోక్షజ్ఞకు వేరే గోల్స్ ఏమైనా ఉన్నాయేమో అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక బాలయ్య అయితే మోక్షజ్ఞ ఎంట్రీని సీరియస్ గా తీసుకున్నట్లు మరొక కొత్త టాక్ వస్తోంది. కొడుకు కోసం పూరి జగన్నాథ్ చేత ఒక మంచి కథను కూడా రెడీ చేయించిన్నట్లు సమాచారం. కుదిరితే బాలకృష్ణ జూన్ 10న తన పుట్టినరోజున కొడుకు సినిమాను లాంచ్ ఈవెంట్ తో మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ కథనాలు ఎంతవరకు నిజమవుతాయో చూడాలి.