బాక్సాఫీస్ : మరో డే మరో రికార్డ్ తో “ఆనిమల్” వసూళ్లు.!

ఇప్పుడు బాలీవుడ్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో బాక్సాఫీస్ ని దంచి కొడుతున్న సంచలన హిట్ చిత్రం “ఆనిమల్” కోసం అందరికీ తెలిసిందే బాలీవుడ్ స్టార్ హీరో హీరోగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం ఏ సర్టిఫికెట్ తో అందులోని మూడు గంటల 21 నిమిషాల నిడివితో కూడా ఆడియెన్స్ కి ఎక్కడ లేని హై ని ఇస్తూ మొదటి రోజు నుంచే రికార్డు వసూళ్లు నమోదు చేస్తున్న ఈ చిత్రం ఇప్పుడు వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా సరికొత్త రికార్డ్స్ సెట్ చేస్తుంది.

మరి నిన్న సోమవారం వసూళ్లే ఇండియన్ సినిమా దగ్గర ఏ సినిమాకి రాని రికార్డు నంబర్స్ నమోదు చేయగా ఇప్పుడు మంగళవారం కూడా ఆనిమల్ రికార్డు వసూళ్లు అందుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. మరి దీనితో ఈ చిత్రం 5వ రోజు 34 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకోగా మొత్తం ఈ ఐదు రోజుల్లో అయితే ఈ చిత్రం ఏకంగా 481 కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టి 500 కోట్ల గ్రాస్ దిశగా దూసుకెళ్తుంది.

మరి ఈ 6వ రోజు వసూళ్లతో అయితే ఈ చిత్రం ఆ మార్క్ ని క్రాస్ చేసేస్తుంది అని చెప్పొచ్చు. ఇక ఈ సెన్సేషనల్ హిట్ చిత్రం తెలుగులో కూడా 50 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి బాలీవుడ్ నుంచి హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా వెళ్లబోతుంది. మొత్తానికి అయితే ఆనిమల్ సెన్సేషనల్ ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.