పవన్ ఇంటి నుంచి మహేష్ ఇంటికి స్పెషల్ కానుక

pawan

టాలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు స్నేహంగానే ఉంటారు. బయట ఎక్కువగా కనిపించకపోయినా కూడా కొందరైతే కష్ట సుఖాల్లో కూడా తోడుగా ఉంటారు. ఇక మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ మరీ అంత సన్నిహితులు కాకపోయినప్పటికీ ఇద్దరికి కూడా ఒక మంచి రిలేషన్ అయితే ఉంది. ఇక ఇటీవల క్రిస్మస్ సందర్బంగా పవన్ ఇంటి నుంచి మహేష్ ఇంటికి ఒక స్పెషల్ గిఫ్ట్ ను వెళ్లింది.

anna lezhneva
anna lezhneva special christmas hamper to mahesh couples

ఇక ఆ కానుకను పంపింది మరెవరో కాదు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజ్నెవా. రష్యాకు చెందిన అన్నా లెజ్నెవా పవన్ కళ్యాణ్ కోసం హిందూ సాంప్రదాయాలను పాటిస్తున్నప్పటికీ తన క్రిస్టియన్ పద్దతులను కూడా ఏ మాత్రం మరువదు. ప్రతి క్రిస్మస్ కు తోటి ఆత్మీయులకు గుర్తిండిపోయేలా కానుకలు పంపడమే కాకుండా మంచి జరగాలని స్పెషల్ నోట్ కూడా పంపుతూ ఉంటారు.

ఇక ఈ సారి మహేష్, నమ్రతలకు కూడా అన్నా లెజ్నెవా ఒక స్పెషల్ హాంపర్ ను కానుకగా పంపారు. మీకు ఎల్లపుడు మంచే జరగాలని కోరుకుంటున్నట్లు చెబుతూ సున్నితమైన అద్భుతాల ద్వారా మీరు ఆశీర్వదించబడతారని ఆశిస్తున్నాను. క్రిస్మస్ శుభాకాంక్షలు! అన్నా, కళ్యాణ్..అంటూ ఆమె పేర్కొన్నారు. ఇక అందుకు సంబందించిన స్పెషల్ ఫొటోను నమ్రత షోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు.