విశాల్ పెళ్లి పెటాకులు.. అనీషా ఎంగేజ్మెంట్ అయిపోయిందా?

Anisha Reddy Got Engageed With A Business Man

హీరో విశాల్ హైద్రాబాద్ అమ్మాయితో పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు. ఎంగేజ్మెంట్ కూడా అయింది అప్పట్లో. అయితే ఆ తరువాతే అసలు సమస్య మొదలైంది. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. కానీ ఈ విషయాన్ని ఎక్కడా కూడా బయటకు రానివ్వలేద. రేపు మాపు అంటూ పెళ్లి వాయిదా వేస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చాడు. విశాల్ తండ్రి జీకే రెడ్డి కూడా పెళ్లి క్యాన్సిల్ అయిందని ఏనాడూ చెప్పలేదు. తాజాగా కొన్ని వార్తలు బయటకు వచ్చాయి.

Anisha Reddy Got Engageed With A Business Man
Anisha Reddy Got Engageed With A Business Man

‘పెళ్లిచూపులు’ సినిమాలో విజయ్ గర్ల్‌ఫ్రెండ్‌గా నటించిన అనీషా రెడ్డి ప్రస్తుతం వేరే అబ్బాయితో నిశ్చితార్థం జరిగినట్టు తెలుస్తోంది. విశాల్‌తో జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నట్టు తెలిసిపోతోంది. అప్పట్లో అనీషా తన సోషల్‌మీడియా అకౌంట్లో ఎంగేజ్‌మెంట్ ఫోటోలు డిలీట్ చేయడంతో ఇద్దరి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందని అందరూ భావించారు. ఇప్పుడు ఇలా ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిగిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. అనీషా రెడ్డికి ఓ యువ వ్యాపారవేత్తతో వివాహం నిశ్చయమైందట. త్వరలోనే వీరి వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేస్తున్నారట. మరి ఇప్పటికే వీటిపై విశాల్, ఆయన తండ్రి ఏదైనా స్పందిస్తారో లేదో చూడాలి. అనీషా రెడ్డి కూడా తన నిశ్చితార్థం వేడుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తానికి వ్యవహారం మాత్రం పెళ్లి పీటలు ఎక్కకముందే కుప్పకూలిపోయింది. విశాల్‌ వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య కూడా ఇలాంటి వార్తలే వచ్చాయి. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతోన్నారని రూమర్లు వచ్చాయి. కానీ తామిద్దరం మంచి స్నేహితులమేని చెప్పుకొచ్చిని సంగతి తెలిసిందే.