దేవరకొండ మూవీ కోసం అనిరుద్

లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ… తాను చేస్తున్న అన్ని సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఆయన శివానిర్మాణ దర్శకత్వంలో కృషి అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత సుకుమార్ తో ఒక సినిమా ఉండే అవకాశం ఉందని గతంలో ప్రచారం జరిగింది. కానీ విజయ్ దేవరకొండ 12వ సినిమా గౌతమ్ తిన్ననూరీ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది.

పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో జనగణమన ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన శ్రీకర స్టూడియోస్ ఈ సినిమాని ప్రజెంట్ చేస్తూ ఉండగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగవంశీ ఫార్చునర్ ఫోర్ సినిమాస్ బ్యానర్ మీద సాయి సౌజన్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ అధికారిగా నటించబోతున్నట్లుగా గతంలో విడుదల పోస్టర్ ద్వారా క్లారిటీ వచ్చింది.

అయితే ఇప్పుడు ఈ సినిమా సంగీత దర్శకుడిగా విషయంలో సందీప్ గత నెలకొన్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా అనిరుద్ ని తీసుకోవాలని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. కానీ ఇప్పటికే సార్ సినిమా కోసం జీవి ప్రకాష్ కుమార్ తో పనిచేసే ఉండడంతో నాగవంశీ తో పాటు సాయి సౌజన్య సైతం ప్రకాష్ కుమార్ ని ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే గౌతం తిన్నానూరి మాత్రం తనకు అనిరుద్ మాత్రమే కావాలని పట్టుబట్టి ఆయననే ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

కానీ అని అనిరుద్ విషయంలో మాత్రం ఒక కంప్లైంట్ ఉందని అంటున్నారు. ఆయన ఇప్పటికే ఒప్పుకున్న సినిమాలకే పాటలు ఇవ్వడం లేదని ఇప్పుడు కొత్తగా ఒప్పుకున్న సినిమాలకు ఎప్పటికీ పాటలు ఇస్తాడో తెలియదని అంటున్నారు. అయితే గౌతం తిన్ననూరి మాత్రం తనకు అనిరుద్ మాత్రమే కావాలని పట్టుబట్టడంతో నిర్మాతలు కూడా పెద్దగా మాట్లాడలేకపోయారని టాక్ వినిపిస్తోంది. ఇక జెర్సీ సినిమాతో హిట్టు అందుకున్న గౌతం తిన్న నూరి ఆ సినిమాని బాలీవుడ్లో రీమిక్స్ చేసి డిజాస్టర్ అందుకున్నారు. తర్వాత రామ్ చరణ్ తో ఒక ప్రాజెక్ట్ ఒప్పించి సెట్స్ మీదకు వెళుతుందనుకుంటున్న సమయంలో క్యాన్సిల్ అయింది.