కీలక టెస్ట్ మండే భారీ రికార్డు సెట్ చేసిన “ఆనిమల్” వసూళ్లు.!

ఈ ఏడాది బాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన పలు భారీ చిత్రాల్లో డిసెంబర్ నెల స్టార్టింగ్ తోనే ఓ బ్లాస్ట్ లాంటి హిట్ లా వచ్చిన లేటెస్ట్ చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రం ఇపుడు సెట్ చేస్తున్న రికార్డ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు.

కాగా రిలీజ్ అయ్యిన రోజు నుంచి మొన్న ఆదివారం వసూళ్ల వరకు కూడా ఆనిమల్ వరల్డ్ వైడ్ గా సెన్సేషనల్ పెర్ఫామెన్స్ ని చేయగా నిన్న కీలకమైన టెస్ట్ వర్కింగ్ డే అయినటువంటి మొదటి సోమవారం టెస్ట్ ని కూడా భారీ వసూళ్లతో డిస్టెన్స్ లో ఆనిమల్ పాస్ అవ్వడం క్రేజీగా మారింది.

మరి ఈ చిత్రం ఒక్క సోమవారం వసూళ్లే 70 కోట్ల మేర వరల్డ్ వైడ్ సాధించి రికార్డు సెట్ చేసింది. ఇక హిందీ మార్కెట్ లో అయితే మొదటి సోమవారం 40 కోట్లకి పైగా గ్రాస్ అందుకున్న ఏకైక బాలీవుడ్ చిత్రంగా కూడా ఇది నిలిచింది. మరి ఆనిమల్ చిత్రం వరల్డ్ వైడ్ గా అయితే ఈ నాలుగు రోజుల్లో ఏకంగా 425 కోట్లకి పైగా గ్రాస్ ని కొల్లగొట్టింది.

ఇక ఈ ఐదవ రోజు కూడా వర్కౌట్ అయితే జస్ట్ 5 రోజుల్లోనే ఈ చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరిపోతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే యూఎస్ లో కూడా రికార్డు మీద రికార్డు వసూళ్లతో 7 మిలియన్ డాలర్స్ కి పైగా రాబట్టేసింది. మొత్తానికి ఇలా ఆనిమల్ బ్యాటింగ్ మాత్రం ఇప్పుడు మామూలు లెవెల్లో లేదని చెప్పాలి.

కాగా ఈ చిత్రంలో హీరోగా బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ నటించగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అలాగే టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని తెరకెక్కించి బాలీవుడ్ కి ఒక రీసౌండింగ్ సెన్సేషనల్ హిట్ ని అందించాడు.