“ఆనిమల్” లో ఆ సీన్ కాంట్రవర్సీపై మేకర్స్ స్ట్రాంగ్ రిప్లై.. 

గత ఏడాదిలో బాలీవుడ్ సినిమా దగ్గర దుమ్ము లేపిన పలు చిత్రాల్లో బిగ్గెస్ట్ హిట్ గా వచ్చిన చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. హీరో రణబీర్ కపూర్ మరియు మన తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్ లో వచ్చిన ఈ క్రేజీ చిత్రం డిసెంబర్ నెలలో వచ్చిన పలు బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ సినిమా సక్సెస్ పై మేకర్స్ నిన్ననే బాలీవుడ్ లో గ్రాండ్ పార్టీ కూడా చేసుకున్నారు. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యిన తర్వాత నుంచి ఎప్పటిలానే సందీప్ వంగ సినిమాలపై వచ్చే నెగిటివ్ కన్నా కాస్త ఎక్కువే వచ్చింది. అలా ఈ సినిమాలో ఓ సన్నివేశంపై చాలా కామెంట్స్ వినిపించాయి.

హీరో పాత్ర జోయా పాత్రని మోసం చేయడం చాలా మందికి నచ్చలేదు అంటూ కామెంట్స్ చేశారు. అలాగే కొందరు ఫెమినిస్ట్ లు కూడా సోషల్ మీడియాలో హంగామా చేశారు. అయితే ఎందుకో ఈ సీన్ పై సోషల్ మీడియా టీం ఒక ఊహించని రిప్లై అందించారు.

సరే అదే సీన్ రన్విజయ్ సింగ్, జోయా పాత్రల్లో అమ్మాయి ప్లేస్ లో అబ్బాయి ఉండి అమ్మాయి అబ్బాయిని నువ్ నిజంగా ప్రేమిస్తే నా బూట్లు నాకు అని అంటే ఆ సీన్ ని మీరు సంతోషంగా సెలబ్రేట్ చేసుకోరా? అది నిజమైన ప్రేమ అయినప్పుడు ఇది కూడా నిజమైన ప్రేమే అంటూ క్రేజీ సమాధానం అందించారు.

దీనితో ఈ పోస్ట్ ఇప్పుడు మరోసారి బాలీవుడ్ ఫాన్స్ టాలీవుడ్ ఫ్యాన్స్ లో గట్టిగా వైరల్ అవుతుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్స్ గా రష్మికా మందన్నా, త్రిప్తి దిమిరిలు నటించగా టి సిరీస్, సందీప్ రెడ్డి వంగ కాంపౌండ్ నిర్మాణం వహించారు. వరల్డ్ వైడ్ గా సుమారు ఈ చిత్రం 900 కోట్ల మేర గ్రాస్ కొల్లగొట్టింది.