యూఎస్ లో భారీ రికార్డ్స్ సెట్ చేస్తున్న “ఆనిమల్” వసూళ్లు.!

ఈ ఏడాది ఎండింగ్ మొంత్ డిసెంబర్ నెల స్టార్టింగ్ లోనే రిలీజ్ అయ్యిన అవైటెడ్ బాలీవుడ్ చిత్రం “ఆనిమల్” కోసం ఇపుడు ఇండియన్ ఆడియెన్స్ కి గాని తెలుగు ఆడియెన్స్ కి కానీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కాగా ఈ చిత్రంలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

ఇక ఈ సినిమా ఒక్క ఇండియా లోనే కాకుండా యూఎస్ మార్కెట్ లో కూడా ఏ బాలీవుడ్ సినిమా కూడా క్రియేట్ చేయని సెన్సేషనల్ రికార్డు ని సెట్ చేసింది. ప్రీమియర్స్ నుంచే ఆనిమల్ సినిమాకి అక్కడ రికార్డు వసూళ్లు రాగా ఇప్పుడు ఏకంగా ఈ వసూళ్లు 13 మిలియన్ డాలర్స్ కి పైగా వసూళ్లు రాబట్టింది.

అంటే ఇండియన్ కరెన్సీలో సుమారుగా 108 కోట్ల రూపాయల గ్రాస్ ని ఈ చిత్రం ఒక్క యూఎస్ మార్కెట్ నుంచే కొల్లగొట్టింది. ఇక ఇది ఇక్కడితో ఆగలేదు ప్రెజెంట్ ట్రెండ్ చూస్తే ఈ సినిమా నెక్స్ట్ 15 మిలియన్ డాలర్స్ వరకు కూడా వెళుతుంది అని ట్రేడ్ సర్కిల్స్ చెపుతున్నాయి.

ఇదే జరిగితే RRR సినిమా రికార్డు దగ్గరకి వెళ్ళిపోయినట్టే అని చెప్పాలి. మరి ఈ సినిమా ఫైనల్ మార్క్ ఎక్కడ ఆగుతుందో చూడాల్సిందే. ఇంకా ఈ సినిమాలో బాబీ డియోల్ విలన్ గా నటించగా త్రిప్తి దిమిరి మరో హీరోయిన్ గా నటించింది.