అక్కడ తుక్కు రేగ్గొడుతున్న “ఆనిమల్” వసూళ్లు.!

పాన్ ఇండియా మార్కెట్ లోకి లేటెస్ట్ గా రిలీజ్ కి వచ్చిన భారీ చిత్రాల్లో బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “ఆనిమల్” కూడా ఒకటి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అలాగే బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన మూడు గంటల 21 నిమిషాల సినిమా ఇది.

అయినా కూడా ఎక్కడా తగ్గకుండా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ఈ సినిమాకి సెన్సేషనల్ రెస్పాన్స్ నమోదు అవుతూ దూసుకెళ్తుంది. చాలా వరకు మొదటి రోజు కంటే రెండో రోజే రికార్డు వసూళ్లు ఈ సినిమా కొల్లగొడుతుంది అని ట్రేడ్ వర్గాలు కూడా చెప్తున్నాయి.

అయితే యూఎస్ మార్కెట్ లో ఆనిమల్ చిత్రం అయితే ఏ బాలీవుడ్ సినిమా కూడా ఇప్పటివరకు సెట్ చెయ్యని భారీ రికార్డులు వసూళ్లతో నమోదు చేస్తుంది. ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే నాలుగున్నర మిలియన్ డాలర్స్ వసూలు చేసి బిగ్గెస్ట్ రికార్డు సెట్ చేసింది.

రీసెంట్ టైం లో వచ్చిన ఏ ఇండియన్ సినిమా కి కూడా ఈ రేంజ్ రెస్పాన్స్ అయితే అమెరికా మార్కెట్ లో రాలేదు. దీనితో ఫైనల్ రన్ లో చాలా ఈజీగా ఈ చిత్రం 10 మిలియన్ క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి. కాగా ఒక్క యూఎస్ లోనే కాకుండా న్యూజిలాండ్ ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో కూడా ఆనిమల్ రికార్డు వసూళ్లు రిజిస్టర్ చేస్తున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఆనిమల్ మాత్రం ఇప్పుడు వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర తుక్కు రేగ్గొడుతుందనే చెప్పాలి.