భారీ ఆఫర్స్ తో “ఆనిమల్” సెకండ్ బ్యూటీ..!

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర భారీ వసూళ్లతో క్రేజీ రికార్డ్స్ లేటెస్ట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది రణబీర్ కపూర్ హీరోగా నటించిన చిత్రం “ఆనిమల్” అనే చెప్పాలి. టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించాడు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మికా మందన్నా చాలా బోల్డ్ పాత్రలో కనిపించి మెప్పించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఐతే ఈమెతో పాటుగా ఈ చిత్రంలో కనిపించిన రెండో హీరోయిన్ కోసం ఇపుడు అంతా మాట్లాడుకుంటున్నారు. కాగా ఆమెనే తృప్తి దిమిరి. సినిమా సెకండాఫ్ ల వచ్చిన ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు కుర్రకారు మనసు కొల్లగొట్టింది. మరి తెలుగులో కూడా మంచి అటెన్షన్ ని తెచ్చుకున్న ఈ హీరోయిన్ ఇప్పుడు బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి కూడా అనేకమంది ప్రొడ్యూసర్స్ నుంచి భారీ ఆఫర్స్ ను అందుకుంటున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి.

దీనితో ఈ ఒక్క సినిమా ఇప్పుడు ఆమె ఫేట్ నే మార్చేసింది అని చెప్పాలి. అప్పుడు అర్జున్ రెడ్డి తో హీరో విజయ్ దేవరకొండ ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓవర్ నైట్ స్టార్ ని చేస్తే ఇప్పుడు ఆనిమల్ తో ఈమెని ఒక్క దెబ్బకి భారీ ఆఫర్స్ వచ్చేలా చేసాడని చెప్పాలి. మరి ముందు రోజుల్లో అయితే మరిన్ని హిందీ తెలుగు సినిమాల్లో ఆమెని మనం తప్పకుండా చూడవచ్చు.