‘భోళా శంకర్ నిర్మాత అనిల్ సుంకరకు ఏమైంది.? ఆయన ఆర్ధికంగా మెగాస్టార్ చిరంజీవిని వేధించడమేంటీ.? సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా గాసిప్ ఇది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో అనిల్ సుంకర ‘భోళా శంకర్’ సినిమా రూపొందించిన సంగతి తెలిసిందే. ఆశించిన స్థాయిలో ఈ సినిమా విజయం సాధించలేదు. అనుకున్న స్థాయి కలెక్షన్లూ రాబట్టలేదు.
దాంతో నిర్మాత ఆర్ధికంగా చాలా నష్టపోయాడంటూ ప్రచారం జరుగుతోంది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటూ చిరంజీవిపై ఒత్తిడి తీసుకొస్తున్నారట అనిల్ సుంకర. ఈ మధ్య ‘ఏజెంట్’ సినిమాతో బాగా దెబ్బ తినేశాడు అనిల్ సుంకర. ఇది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత శ్రీ విష్ణు నటించిన ‘సామజవరగమన’ చిన్న సినిమానే అయినా కాస్త కోలుకోగలిగాడు ఈ సినిమాతో.
మళ్లీ ఇప్పుడు ‘భోళా శంకర్’ రూపంలో గట్టి కాజా తగిలేసిందట అనిల్ సుంకరకి. నిర్మాతల సినిమా.. ప్రేక్షక అభిమానుల సినిమా ‘భోళా శంకర్’ అని చిరంజీవి పదే పదే చెప్పారు.
అందులో అసత్యం ఎంత మాత్రమూ లేదు. నిర్మాతల గురించి ఆలోచించే వారిలో ఎప్పడూ ముందుంటారు మెగాస్టార్ చిరంజీవి. తన అభిరుచిని సైతం పక్కన పెట్టి, నిర్మాతలకు తన సినిమాల కారణంగా నష్టం రాకూడదనుకుంటారు.
అలాంటిది, ‘భోళా శంకర్’ విషయంలో ఎక్కడో మాయాజాలం జరిగింది. తెర వెనక ఏం జరిగిందో ఏమో కానీ, ఈ గాసిప్‌పై అనిల్ సుంకర సైతం ఇంతవరకూ స్పందించకపోవడం ఆశ్చర్యకరం.