Anil Ravipudi : స్పీడ్ పెంచిన అనిల్.. ఎన్టీఆర్ కోసమేనా…!

Anil Ravipudi : కొత్త దర్శకులలో చాలా త్వరగా టాప్ పొజిషన్ కు చేరుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. తన సినిమాల్లోని కామెడీ టైమింగ్ కథనం తో మంచి హిట్లు ఎందుకుని అనతి కాలంలోనే టాప్ డైరెక్టర్స్ స్టేజి కీ వెళ్ళిపోయాడు. పటాస్ సినిమా తో లైం లైట్ లోకి వచ్చిన అనిల్, f2 సినిమా తో మంచి కుటుంబ కథా చిత్రం తీసి హిట్ కొట్టాడు ఇక మహేష్ బాబురహో తీసిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో మాస్ విజయం సంపాదించాడు ఈ కుర్ర డైరెక్టర్.

ఇపుడు మరోసారి f2 సీక్వేల్ f3 షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక f3 సినిమా లో వెంకటేష్, వరుణ్ తేజ్ వారికి జోడిగా తమన్నా, మెహరిన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. అనిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ను చాలా భారీగానే ప్లాన్ చేసుకున్నాడు.ఎన్టీఆర్ తో ఒక సినిమా ను బాలయ్య తో ఓ సినిమాను ఓకే చేయించుకున్నాడు అనిల్.

ఇక బాలయ్యతో సినిమా విషయంలో అసలు కథా చెప్పకుండా సినిమా ఓకే చేయించుకుని అందరిని ఆశ్చర్య పరిచాడు. ఇక ఎన్టీఆర్ తో సినిమా ను త్వరగా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట అనిల్. అందుకోసం f3 షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అపుడే కథని సిద్ధం చేసి ఎన్టీఆర్ కు వినిపించడం ఓకే చేయించుకోవడం జరిగిపోయాయట. ఇక స్క్రిప్ట్ పనులు కూడా పూర్తి చేసాడట అనిల్. ఇక డైలాగులు రాయడం మొదలుపెట్టే ముందు ఎన్టీఆర్ తో చర్చించి ఆ. పని కూడా కానిచ్చి షూటింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు.

అయితే ఎన్టీఆర్ అపుడే అనిల్ సినిమా కోసం డేట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల సినిమా షూటింగ్ కోసం ప్రిపేర్ అవుతున్నాడు. దీన్ని తర్వాత లైన్ లో బుచ్చిబాబు పెద్ది సినిమాతో రెడీ గా ఉన్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే అనిల్ తో సినిమా అవకాశం ఉంది.కాని అనిల్ మాత్రం వచ్చే ఏడాదికి వరుసగా రెండు సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్నారట. స్పీడు మీదున్న ఈ కుర్ర దర్శకుడు ఏ సినిమాలను హిట్ చేసుకుంటాడో చూడాల్సిందే.