అనిల్ రావిపూడి ఆ స్టార్ హీరో కోసం అంతగా తాపత్రయపడుతున్నాడా ..?

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ లో సక్సస్ ఫుల్ డైరెక్టర్ గా విపరీతమైన క్రేజ్ తో ఉన్నాడు. స్టార్ హీరోలందరూ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా వరకు అనిల్ రావిపూడి నుంచి వచ్చిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. వసూళ్ళ సునామీని సృష్ఠించాయి. చెప్పాలంటే అనిల్ రావిపూడి మొదటి సినిమా నుంచి అందరు స్టార్ హీరోలతోనే సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు సపోర్ట్ కూడా అనిల్ రావిపూడి కి ఉండటం తో భారీ ప్రాజెక్ట్స్ చేసే అవకాశం అందుకుంటున్నాడు.

F3 movie- confusion and thrill || Anil Ravipudi F3 Movie Latest Update ||  #GNNFilmDhaba - YouTube

ఎఫ్ 2 అన్న భారీ మల్టీస్టారర్ తో 100 కోట్ల క్లబ్ లో చేరాడు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు మంచి కమర్షియల్ హిట్ గా నిలిచింది. కాగా ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్నాడు. ఈ భారీ మల్టీస్టారర్ లో కూడా వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ హీరో.. హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాని అనిల్ రావిపూడి సమ్మర్ కి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాడని సమాచారం.

Balakrishna to team up with director Anil Ravipudi? | Telugu Movie News -  Times of India

కాగా టాలీవుడ్ లో గత కొన్ని రోజులుగా అనిల్ రావిపూడి ఒక సీనియర్ స్టార్ హీరో తో సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. కాని ఇప్పటి వరకు ఈ విషయం అఫీషియల్ గా వెల్లడి కాలేదు. ఆ సీనియర్ హీరో బాలకృష్ణ కాగా ఇప్పటికే అనిల్ రావిపూడి బాలయ్య కి కథ కూడా చెప్పాడని చెప్పుకుంటున్నారు. అయితే కొంతమంది అనిల్ రావిపూడి లాంటి టాలెంటెడ్ డైరెక్టర్ కి బాలయ్య ఖచ్చితంగా డేట్స్ ఇస్తాడని అంటున్నారు. అంతేకాదు త్వరలో అనిల్ రావిపూడి – బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. చూడాలి మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ అవుతుందో.