యాంకర్ శ్రీముఖి రవి ఒకప్పుడు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. యాంకర్ రవి లాస్య జోడి మంచి ఊపులో ఉండగా.. శ్రీముఖి రాకతో ఆ జంట విడిపోయిందని అప్పట్లో తెగ టాక్ వచ్చింది. అయితే రవి లాస్య ఎంతగా ఫేమస్ అయిందో.. రవి శ్రీముఖి కూడా అదే రేంజ్‌లో వైరల్ అయింది. ఈ ఇద్దరూ కలిసి పటాస్ షోను ఓ లెవెల్‌లో పెట్టారు. జబర్దస్త్‌కు పోటిగా పటాస్‌ను పట్టుకొచ్చారు. అసలు పటాస్ అంటే శ్రీముఖి రవి అనేంతగా పాపులర్ అయ్యారు. అలాంటి శ్రీముఖి పటాస్‌ను వదిలి బిగ్ బాస్‌కు వెళ్లిపోయింది.
బిగ్ బాస్‌కు వెళ్లిన శ్రీముఖిని రవి ఏనాడూ సపోర్ట్ చేయలేదు. ఇక పటాస్ షోను రవి మెల్లిగా నడిపించుకున్నాడు. మధ్యలో వర్షిణి, విష్ణుప్రియ వంటి వారు వచ్చారు. బాగానే హ్యాండిల్ చేశారు. అంతా బాగానే ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్‌లో ఉండగా శ్రీముఖి రాహుల్ మధ్య జరిగిన గొడవలు అందరికీ తెలిసిందే. ఈ గొడవల్లో ఏనాడూ కూడా రవి శ్రీముఖికి మద్దతు తెలపలేదు. రాహుల్ నిజాయితీగా కనిపిస్తున్నాడు.. విన్నర్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పాడు. రాహుల్, వరుణ్ సందేశ్ అంటే చాలా ఇష్టమని వారు బాగా ఆడుతున్నారని అన్నాడు కానీ ఏనాడూ శ్రీముఖికి ఓటు వేయండని చెప్పలేదు.
అలా బయటకు వచ్చిన శ్రీముఖి రవికి దూరమైంది. పటాస్ షోలో పిలిచినా కూడా రవి ఉన్నాడని వెళ్లలేదని తెలుస్తోంది. అలా ఈ ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. అందుకే బొమ్మ అదిరింది షోలో శ్రీముఖి ఎంట్రీతో రవి అవుట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తాజాగా ఈ ఇద్దరి మధ్య ఉన్న వైరాన్ని వర్షిణి బయటపెట్టింది. తాజాగా క్యాష్ షోలో వర్షిణి, ఆమె తల్లి పాల్గొన్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరూ కలిసి ఓ చిన్న స్కిట్ చేశారు. వర్షిణి, ఆమె అమ్మ… ఇద్దరూ క్యారెక్టర్స్ చేంజ్ చేసుకున్నారు. వర్షిణి వాళ్ల అమ్మ మాట్లాడుతూ.. అమ్మ నేను పార్టీకి వెళ్లాలి.. రవి వాళ్ల ఇంట్లో అక్కడ అందరూ వెళ్తున్నారు.. అనసూయ, శ్రీముఖి అంటూ చెప్పబోయింది. వెంటనే వర్షిణి అందుకుని రవి అంటే శ్రీముఖి రాదు అని వారి మధ్య ఉన్న దూరాన్ని ఇలా బయటపెట్టేసింది.