సుమ గత ముప్పై ఏళ్లుగా బుల్లితెర మీద తిరుగులేని స్టార్ గా వెలుగుతుంది. సుమ మొదట్లో హీరోయిన్ గా కొన్ని చిత్రాలు చేసింది. అయితే అవేమి సుమకు గుర్తింపు తీసుకురాలేదు. తర్వాత హీరోయిన్ గా మానేసి యాంకర్ గా చెయ్యటం మొదలుపెట్టింది.
తెలుగు టీవిలో యాంకర్ గా చాలా సంవత్సరాలుగా సుమ ది నెంబర్ వన్ పోసిషన్ అని చెప్పవొచ్చు. సుమ యాంకర్ గా వచ్చిన తర్వాత కొన్ని వందల మంది హీరోయిన్లు గా వచ్చి వెళ్లిపోయారు. సుమ మాత్రం యాంకర్ గా ఆలా పాతుకుపోయి ఇప్పటికి మంచి లైంలైట్ లో వున్నారు.
తన స్టాఫ్ ని సొంత మనుషుల్లాగ చూసుకుంటుందని సుమకి పరిశ్రమలో పేరుంది. అందుకే తన దగ్గర కొందరు ఇరవై ఏళ్లుగా పనిచేస్తున్నారంటే ఆశ్చర్యమేమీ లేదంటారు.
తాను ఒక షోకి రెడీ అవుతున్నప్పుడు సరదాగా తన మేకప్ టీం తో ఒక వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అందరిని ఎప్పటినుండి మీరు పనిచేస్తున్నారు అని అడుగుతూ, వారు ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలుగా పని చేస్తున్నాము అని చెబుతుండగా, సుమ తాను 30 ఇయర్స్ ఇండస్ట్రీ అని, తానే అందరికంటే సీనియర్ అని సరదాగా ముగించింది.
సుమ తన వయస్సు మీద తాను జోకులు వేసుకోవడం మనం చాలా షోల్లో చూసేవుంటాం. మిగతావారు ఏదన్నా సరదాగా అన్నా సుమ చాలా స్పోర్టివ్ గా తీసుకుంటుంది, తిరిగి వాళ్లకు నవ్వుతేనే మంచి పంచ్ ఇస్తుంది.