మహాతల్లితో కలిసి శ్రీముఖి రచ్చ.. డ్యాన్స్ వీడియో వైరల్

anchor srimukhi and mahathalli dance together video goes viral

యూట్యూబర్ మహాతల్లి తెలుసు కదా. తన పేరు మహాతల్లి కాదు.. తన పేరు జాహ్నవి. కానీ.. తను మహాతల్లి యూట్యూబ్ చానెల్ తో ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ యూట్యూబర్ తో కలిసి యాంకర్ శ్రీముఖి రచ్చ చేసింది. విచిత్రంగా ఆమెతో కలిసి డ్యాన్స్ చేసింది.

anchor srimukhi and mahathalli dance together video goes viral
anchor srimukhi and mahathalli dance together video goes viral

ఆ డ్యాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. శ్రీముఖి తన యూట్యూబ్ చానెల్ లో ఓహ్.. విమెనియా.. అనే టాక్ షోను ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా జాహ్నవితో శ్రీముఖి ఈ టాక్ షోను చేయగా… ఆ షోలో భాగంగా.. ఇద్దరు కలిసి విచిత్రంగా డ్యాన్స్ చేశారు. శ్రీముఖి అయితే తనకు తెలిసిన డ్యాన్సులన్నింటినీ చేసి రచ్చ రచ్చ చేసింది. భరత నాట్యం, కథకళి… ఇలా అన్న రకాల సంప్రదాయ డ్యాన్సులను చేసి తన అభిమానులను అలరించింది శ్రీముఖి.

దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే.. యాంకర్ శ్రీముఖి.. లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ సీజన్ 3లో పార్టిసిపేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా.. తను యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసి.. ఆ చానెల్ లో తను పలు రకాల ప్రోగ్రామ్ లను చేస్తోంది.