Anchor Shyamala: వర్మ పై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ శ్యామల…. ఏమన్నారంటే?

Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల చాలా టీవీ కార్యక్రమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే. ఇక అడపాదడపా సినిమాల్లోనూ నటించింది. ఎక్కువగా ఆడియో ఫంక్షన్స్ లోను, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలోనూ యాంకరింగ్ చేస్తుంటారు. అయితే బిగ్ బాస్ షో ద్వారా ఇంకా క్రేజ్ సంపాదించుకుంది శ్యామల. ఇక ఈ మధ్యనే వర్మ కామెంట్స్ తో శ్యామల మళ్ళీ టాక్ అఫ్ ది టౌన్ అయింది.

‘బడవ రాస్కెల్ ‘ మూవీ ఈవెంట్ లో యాంకర్ శ్యామల పై ఆర్జీవీ ఆసక్తికర వాఖ్యలు చేసారు. మీరు చాలా అందంగా ఉన్నారని, ఈ అందం ఇంతకాలం నా కళ్ళ నుంచి ఎలా తప్పించుకుంది అంటూ శ్యామలని ఆర్జీవీ ప్రశంసించారు. అయితే శ్యామల ఇన్ని రోజులు మౌనంగా ఉన్న తాజాగా ఆర్జీవీ కామెంట్స్ పై స్పందించింది. శ్యామల ఇటీవలే తన ఇంస్టాగ్రామ్ లో అభిమానులతో ముచ్చటించారు. ఈ క్రమంలో అభిమానులు ఆర్జీవీ కామెంట్స్ ను ప్రస్తావించగా ‘నో కామెంట్ ‘ అంటూనే ఆసక్తికర వాఖ్యలు చేసింది.

ఆర్జీవీ ముందు సినిమాలు తనకు నచ్చతాయని ఒక నెటిజెన్ ప్రశ్నకు సమాధానం చెప్పింది.ఆర్జీవీ ఇప్పుడు మంచి సినిమాలు తీయట్లేదని, ఆయన ఇప్పుడు తీసే సినిమాలకు ఫ్యాన్ కాదని ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నారా అంటూ నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక మరో నెటిజెన్ మీరు నిజంగా ఏంజెల్ మేడం అన్నం తింటున్నారా, అందం తింటున్నారా అని అడుగగా అన్నమే తింటున్న అంటూ బదులు ఇచ్చింది. ఇక ఫేవరెట్ హీరో హీరోయిన్ ఎవరని అడుగగా మహేష్ బాబు, అనుష్క శెట్టి అంటూ మనసులోని మాట చెప్పింది. ఇక మరో నెటిజెన్ ప్రభాస్ లేక పవన్ కళ్యాణ్ నా అని అడుగగా రాధే శ్యామ్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ ప్రభాస్ ఫేవరెట్ అని చెప్పకనే చెప్పింది శ్యామల.