యాంకర్ రవి వర్షిణి కెమిస్ట్రీ అప్పట్లో ఓ సెన్సేషన్. రవి పక్కన ఎవ్వరూ యాంకరింగ్ చేసినా కెమిస్ట్రీ బాగానే కుదురుతుంది. రవి బాగానే పులిహోర కలుపుతాడన్న పేరును సార్థకం చేసుకుంటాడు. మొదట లాస్యతో దాదాపు రెండు మూడేళ్లు యాంకరింగ్ చేశాడు. ఆ తరువాత లాస్య స్థానంలో శ్రీముఖి వచ్చింది. పటాస్ షోలో ఈ ఇద్దరూ కలిసి చేసిన రచ్చకు షో టాప్ రేటింగ్స్‌లొ దూసుకుపోయింది.
అయితే శ్రీముఖి బిగ్ బాస్ షోలోకి వెళ్లడం అక్కడ యాంకరింగ్ స్థానం ఖాళీ అయింది. అలా వర్షిణి వచ్చి అక్కడ సెటిలైంది. అలా వర్షిణి రవి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అలా ఈ ఇద్దరి జోడి కూడా బాగానే పాపులర్ అయింది. అలా అక్కడ కుదిరిన స్నేహ బంధమే నేటి వరకు కొనసాగుతోంది. దీపావళి సందర్భంగా యాంకర్ రవి వర్షిణిని, ఆమె అక్క సౌజన్యను స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేశాడు.
ఇందులో వర్షిణికి సంబంధించిన ఓ పర్సనల్ విషయం బయటకు వచ్చింది. తన బావ వర్షిణిని బోడిదాన అంటూ ఏడిపిస్తాడట. ఆయన ఒక్కడే అలా అంటాడట. మిగతా వారెవ్వరూ అలా అనరట అని వర్షిణి సోదరి సౌజన్య చెప్పుకొచ్చింది. రావే బోడిదాన అంటూ ఇలా సరదాగా అంటాడని వర్షిణి చెప్పుకొచ్చింది. కానీ ఈ విషయాలన్నీ వర్షిణి స్వయంగా బయటపెట్టలేదు. రవి కూపీ లాగడంతో బయటపెట్టాల్సి వచ్చింది. దీంతో బోడిదాన అంటూ వర్షిణి రవి ఏడిపించేశాడు.