ఇలాంటి రోజు రావాలని దేవుళ్లకు మొక్కాను.. యాంకర్ రవి ఎమోషనల్

Anchor Ravi and Lasya In Its A famliy Party

గత రెండు మూడు రోజులుగా యాంకర్ రవి లాస్యల విషయం తెగ వైరల్ అవుతోంది. ఐదేళ్ల తరువాత ఒకే స్టేజ్ యాంకర్లుగా కనిపించడంతో అందరూ షాక్ అవుతున్నారు. ఒకరంటే ఒకరికి పడకపోయినా, ఇన్నాళ్లూ దూరంగా ఉన్నా కూడా చివరకు ఇలా ఏకమయ్యారు. దాదాపు ఐదేళ్లు దూరంగా ఉండి.. ఎక్కడా కూడా ఎదురుపడకుండా ఉన్నారు. వారు చేసే షోల్లో కూడా మిగతా వారు ఉండకుండా చూసుకునే వారు.

Anchor Ravi and Lasya In Its A famliy Party
Anchor Ravi and Lasya In Its A famliy Party

మొత్తానికి ఏదో మ్యాజిక్ జరిగింది. అభిజిత్ ఇద్దరి మధ్యలో ఉండి కలిపేశాడని తెలుస్తోంది. అలా రవి లాస్యలు ఒక్కటయ్యారు. కలిసి సంక్రాంతి ఈవెంట్‌ను చేసేశారు. అలా ఈ సంక్రాంతి ఈవెంట్ మొత్తాన్ని రవి లాస్య తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ ఈవెంట్ హిట్ అయితే అది కచ్చితంగా రవి లాస్యలకు ఉన్న క్రేజ్ వల్లే అని తెలుస్తుంది. ఆ కాంబో క్రేజ్ ఇంకా తగ్గలేదని అందరికి మరోసారి చూపించినట్టు అవుతుంది.

అయితే తాజాగా సంక్రాంతి ఈవెంట్ ఇట్సే ఫ్యామిలీ పార్టీ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రవి లాస్య ఫ్యామిలీలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రవి భార్య నిత్య లాస్యను హగ్ చేసుకుంది. ఇద్దరి పిల్లలు దగ్గరి తీసుకున్నారు. ఇలాంటి రోజు ఒకటి రావాలని ఎప్పటి నుంచో దేవుడిని మొక్కుతూ వచ్చానని రవి ఎమోషనల్ అయ్యాడు. మీ ఇద్దరు కలవాలన్నది ఎంతో మంది కోరిక అని బాబా భాస్కర్ కూడా కామెంట్ చేశాడు.