AnchorAnasuya: ఉమెన్స్ డే ఫూల్స్ డే అంటూ ట్వీట్ చేసిన అనసూయ… భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

AnchorAnasuya: బుల్లితెర స్టార్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని అనంతరం వెండితెరపై పలు సినిమా అవకాశాలను అందుకుంటే కెరీర్లో దూసుకుపోతున్నారు. ఇలా కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అనసూయ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.

ఈ క్రమంలోనే నేడు మహిళ దినోత్సవం కావడంతో అనసూయ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేశారు. ఉమెన్స్ డే ఫూల్స్ డే అంటూ అనసూయ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎంతో మంది నెటిజన్లు ఈమె చేసిన ట్వీట్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమెన్స్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అనుసూయ ట్వీట్ చేస్తూ…ఓ సడెన్ గా ప్రతి ట్రోలర్ మరియు మీమర్ మహిళలను గౌరవించడం ప్రారంభించారు అయితే 24 గంటలలో ఇది ముగిసిపోతుంది మహిళలు దూరంగా ఉండండి.. హ్యాపీ ఫూల్స్ డే అంటూ ట్వీట్ చేశారు.

ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎంతోమంది ఆగ్రహానికి గురైంది.ఈ సందర్భంగా కొందరు ఈమె చేసిన ట్వీట్ పై స్పందిస్తూ ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరూ కూడా ఒకేలా ఉండరు అంటూ కామెంట్లు చేయగా మరికొందరు మాత్రం ట్వీట్ పై ఘాటుగా స్పందిస్తూ అవును మీలాంటి ఆడవాళ్లు ఉన్నప్పుడు తప్పకుండా అలాంటి మగవాళ్లు కూడా ఉంటారు అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఏదిఏమైనా అనసూయ ఏ పోస్ట్ చేసిన అది సోషల్ మీడియాలో వైరల్ గా మారడం ఒక వివాదానికి కారణం అవ్వడం సర్వసాధారణమైపోయింది.