ప‌వ‌న్‌తో స్టెప్పులేయ‌నున్న హాట్ యాంక‌ర్.. అభిమానుల‌లో ఫుల్ జోష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటేనే ఓ బ్రాండ్. పవర్ స్టార్ పొలిటికల్ హిస్టరీ నడుస్తుండగానే.. సినిమాలతో రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.. వకీల్ సాబ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్, నెక్ట్స్ డైరెక్టర్ క్రిష్ తో ఓ పీరియాడికల్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. అయితే ఈ సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ గాసిప్ వెలుగులోకి వచ్చింది.

బుల్లితెర హాట్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. దీంతోపాటు ఓ చిన్న కారెక్టర్ చేయనున్నట్లు తెలుస్తుంది. నిజానికి అత్తారింటికి దారేది సినిమాలోనే అనసూయకి అవకాశం వచ్చిందట.
ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం అనసూయకి అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కి అనసూయ అదృష్టం అంటూ నెటిజన్లు విష్ చేస్తున్నారు. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకున్నారట. ఈ ఏడాది అనసూయ తమిళం, మలయాళం ప్రేక్షకులకు కూడా దగ్గరకాబోతున్నట్లు అనసూయ ప్రకటించింది.

ప్రముఖ దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న పీరియాడిక్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే అద్దిరిపోయే సెట్స్ తో ప్లాన్ చేస్తారు. దీనికి తోడు అనసూయ డాన్స్ కి, పవన్ కళ్యాణ్ స్టెప్పులకి స్టేజ్ దద్దరిల్లిపోతుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. సో ఈ సాంగ్ సినిమాకి ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందంటున్నారు అభిమానులు. అయితే ఈ విషయంపై ప్రస్తుతం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాని మోగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబందించి మరిన్ని అప్డేట్స్ కోసం మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే.
Anasuya to entertain in special song in Power Star movie ..