అనసూయకు ఉన్న క్రేజ్‌కు ఎన్ని చానెల్స్‌లో, ఎన్ని షోల్లో కనిపించినా తక్కువే అవుతుంది. ప్రేక్షకులు కూడా అనసూయ అందాన్ని, ఆమె నవ్వును ఆస్వాధించేందుకు రెడీగానే ఉంటారు. అందుకు ఇటు బుల్లితెర, అటు వెండితెర ప్రేక్షకులు అనసూయ అంటే పడిచచ్చిపోతుంటారు. అయితే అనసూయ బుల్లితెరపై షోలకు డేట్స్ అడ్జస్ట్ చేయడానికే నానా తంటాలు పడుతూ ఉంటుందన్న సంగతి తెలిసిందే.
అనసూయ ఓ వైపు జబర్దస్త్ చేస్తూనే.. నాగాబాబు మీదున్న గౌరవంతో అదిరింది షోలోనూ మెరుస్తూ ఉంటుంది. అయితే అదిరింది షోలో రెగ్యులర్‌గా మాత్రం అనసూయ కనిపించదు. కానీ అక్కడా ఇక్కడా చేయాలన్న కోరికను మాత్రం బయట పెడుతూనే ఉంటుంది. ఆ మధ్య ఓ ఈవెంట్‌లో ఇలాంటి డైలాగ్ కొడితేనే ధన్ రాజ్ అదిరిపోయే కౌంటర్ వేశాడు. అక్కడ ఎందుకు మా దగ్గరే ఉండిపోవచ్చు కదా అని అదిరింది షో గురించి చెప్పాడు.
జీ తెలుగు దసరా ఈవెంట్‌లో అనసూయ దుమ్ములేపుతోందన్న సంగతి తెలిసిందే. అసలు పక్కా లోకల్ అంటూ అనసూయ అదరగొట్టేసింది. ఇక తాజాగా ఓ స్కిట్‌లో భాగస్వామి అయినట్టుంది. ఆశ్రమం, గురువు, శిష్యుల కాన్సెప్ట్‌తో వేణు, ధన్ రాజ్ స్కిట్స్ వేస్తుంటారు. ఈసారి అనసూయ కూడా అందులో భాగమైంది. ఇక గురువుగా ఉన్న అనసూయ ఆశకు, అత్యాశకు ఉన్న తేడాను చెప్పింది. అక్కడ చేయాలనుకోవడం ఆశ.. ఇక్కడ కూడా చేయాలనుకోవడం అత్యాశ అంటూ తన మనసులోని మాట బయట పెట్టేసింది.