శ్రీవల్లి పాటలో అల్లు అర్జున్‌ నటనకు అమితాబ్‌ ఫిదా..

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ రూపొందించిన సినిమా ‘పుష్ప’ మూవీలో శ్రీవల్లి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని శ్రీవల్లీ సాంగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసింది ఈ సాంగ్‌. అయితే తాజాగా శ్రీవల్లీ పాటపై బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. 14 ఏండ్లుగా ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’ ప్రోగ్రామ్‌కు అమితాబ్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.

తాజాగా ఈ షో 15 సీజన్‌ రీసెంట్‌గా ప్రసారమవుతోంది. తాజాగా జరిగిన ఓ ఎపిసోడ్‌ లో ‘పుష్ప’ సినిమాపై ప్రశ్న రాగా.. ఆ ప్రశ్నకు అమితాబ్‌ సమాధానం ఇస్తూ.. అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప’ నిజంగా ఓ అద్భుతం, ఆ సినిమాలోని శ్రీవల్లీ పాట ఇండియా వైడ్‌ సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇక ఆ సాంగ్‌లో అల్లు అర్జున్‌ చెప్పును వదిలేసే స్టెప్‌ ఒకటి ఉంటుంది. కేవలం చెప్పును వదిలేస్తే ఈ రేంజ్‌లో వైరల్‌ అవడం నేను మొదటి సారి చూశాను. ఆ పాట వచ్చాక చాలా మంది అదే స్టెపును వేశారు. అంటూ అమితాబ్‌ కేబీసీ షోలో తెలిపారు. ప్రస్తుతం అమితాబ్‌ చేసిన ఈ కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అల్లు అర్జున్‌ పై అమితాబ్‌ చేసిన ఈ కామెంట్స్‌ కు ఆయన ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.