NTR: తారక్ నటనకు ఫిదా అయిన తెల్లోల్లు…!

 

NTR: ఎన్టీఆర్ తెలుగు చిత్ర సీమలోకి నందమూరి వారసుడిగా అడుగుపెట్టిన తాతకు తగ్గ మనవడిగా ఎపుడో నిరూపించుకున్నాడు. సినిమా కుటుంబంతో వచ్చిన తాను సొంతంగా ఎదిగాడు. చిన్న వయసులోనే బాక్స్ ఆఫీస్ బంపర్ హిట్స్ ను అందుకున్నాడు. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఇక ఎన్టీఆర్ కి ఉన్న అభిమానుల గురించి చెప్పక్కర్లేదు ఫ్యాన్స్ ఆయన్ను మాన్ అఫ్ మాస్ఎస్ గా పిలుచుకుంటారు.

ఎన్టీఆర్ రామ్ చరణ్ కాంబినేషన్లో రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ థియేటర్లలోకి రానే వచ్చేసింది. ఈ చిత్రం లో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా అదరగొట్టేసారు అనే చెప్పాలి. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.మొన్నామధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఒక థియేటర్స్ మొత్తం టికెట్స్ కొనేసి కెనడాలో ఆశ్చర్య పరిస్తే, కొద్దిరోజులకే మరో చోట కార్స్ తో ఎన్టీఆర్ అని ఆర్ఆర్ఆర్ అని ఆంగ్ల అక్షరాలలో అర్థం వచ్చేలా రాసారు.ఏకంగా విమానం నుండి ఎన్టీఆర్ పాత్ర కొమరం భీమ్ చెప్పే ‘తొక్కుకుంటూ పోవాలే ‘ డైలాగు ను ఆకాశంలో వదిలి సందడి చేసారు.

కాని ఎన్టీఆర్ కు అంతే క్రేజ్‌ అమెరికాలో కూడా ఉంది. ఆర్ ఆర్ ఆర్ సినిమా అమెరికాలో భారీ ఎత్తున విడుదల అయిన సంగతి తెలిసిందే. అక్కడ థియేటర్లలో మన తెలుగు ఫాన్స్ ఈ సినిమాను చూసి సందడి చేయడమే కాకుండా, . అక్కడి తెల్ల వాళ్ళు కూడా థియేటర్లకు వచ్చి మరి ఈ సినిమాని చూశారు. సినిమానీ చూసి ఎన్టీఆర్ నటనకు ఫిదా అయిన, ఆ తెల్ల వాళ్ళు మీడియా ముందుకు వచ్చి జై ఎన్టీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.