తెలుగు చిత్ర పరిశ్రమలో రాజమౌళి సంపాదించిన క్రేజ్ అండ్ పాపులారిటి మరే దర్శకుడు సంపాదించలేదు. బాహుబలి ఫ్రాంఛైజీ కి ముందు కూడా రాజమౌళి అంటే ఇండస్ట్రీలో చాలా ప్రత్యేకం. బాహుబలి ఫ్రాంఛైజీ తర్వాత దర్శక ధీరుడుగా రాజమౌళి పాన్ ఇండియన్ రేంజ్ లో స్టార్ డైరెక్టర్ గా మారాడు. బాహుబలి 1 అండ్ 2 సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమ సత్తా చాటడంతో ఎప్పటికీ రాజమౌళి పేరు ఎప్పటికి నిలిచిపోతుంది.
కాగా పాన్ ఇండియన్ డైరెక్టర్స్ గా ఇప్పుడు రాజమౌళి కి తెలుగు తమిళం నుంచే కాకుండా బాలీవుడ్ నుంచి పోటీగా దర్శకులు రాబోతున్నారు. ఎవడే సుబ్రమణ్యం సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడిగా మారిన నాగ్ అశ్విన్ ఆ తర్వాత అలనాటి ప్రముఖ నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా మహనటి సినిమాని తెరకెక్కించాడు. ఈ సినిమాతో సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా పాపులర్ అయ్యాడు. కేవలం రెండవ సినిమాతో నే ప్రేక్షకుల్లో ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన క్రేజ్ సాధించాడు.
కాగా నాగ్ అశ్విన్ ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ఒక భారీ పాన్ ఇండియన్ సినిమాని రూపొందించబోతున్నాడు. ఇప్పటికే అధికారకంగా ప్రకటించిన ఈ సినిమాని 400 కోట్ల బడ్జెట్ నిర్మించబోతుండగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక కే.జీ.ఎఫ్ 1 తో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా పాపులర్ అయిన ప్రశాంత్ నీల్ కూడా పాన్ ఇండియన్ డైరెక్టర్ అన్న పేరు సంపాదించుకున్నాడు. కే.జీ.ఎఫ్ 1 కి కొనసాగింపుగా తెరకెక్కుతున్న కే.జీ.ఎఫ్ 2 మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.
అలాగే మరో బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కూడా ప్రభాస్ తో ఆదిపురుష్ అన్న భారీ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ 3డి సినిమాలో ప్రభాస్ రాముడిగా.. అలాగే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ రావణుడిగా నటించబోతున్నారు. అన్నీ ప్రధాన భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.
అలాగే లెక్కల మాస్టారు సుకుమార్ కూడ అల్లు అర్జున్ తో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ సినిమా భాషల్లో రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. మాటల మాంత్రీకుడు త్రివిక్రం కూడా ఎన్.టి.ఆర్ 30 ని పాన్ ఇండియన్ సినిమాగా రూపొందించబోతున్నాడు. ఇలా టాలీవుడ్ తో పాటు మరికొంతమంది పరభాషా దర్శకులు కూడా రాజమౌళి పక్కన చేరబోతున్నారు.